ప్రతిరోజూ నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉంటుంది. అయితే రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి 150 నిమిషాల పాటు ఒక మాదిరి నుంచి కాస్త తీవ్రమైన వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదో పేరుకి చేశామంటే.. చేశామా అని కాకుండా శరీరానికి చమట పట్టేంతవరకు వ్యాయామం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అయితే అతిగా, విపరీతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం…
ఏపీ సీఎం జగన్ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సరస్వతి నగర్‌లో జగన్ బాధితులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తిరుపతి కార్పొరేషన్ సరస్వతి నగర్ లో సీఎం వైయస్ జగన్ ను కలిశారు కిడ్నీ పేషెంట్ బి కుసుమ కుటుంబ సభ్యులు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు.…
సిరివెన్నెల ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిరివెన్నెల ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలియజేశారు. న్యూమోనియాతో బాధపడుతూ సిరివెన్నెల ఈనెల 24 వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సిరివెన్నెల సినిమాలో సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఫేమస్ అయ్యారు. సిరివెన్నెల త్వరగా కొలుకొని తిరిగి మంచి పాటలు రాయాలని తెలుగు చిత్రపరిశ్రమ…
రోడ్డు ప్రమాదాలకు, అనారోగ్యాలకు కారణమయిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తారు. కొందరు కోమాలో వుంటారు. ఆయా రోగుల పరిస్థితిని బట్టి డాక్టర్లు వైద్యం అందిస్తారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటే…ఇక ఆ వ్యక్తి చనిపోయినట్టే లెక్క. కానీ యూపీలో ఓ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా ఆ వ్యక్తి పోస్ట్ మార్టం చేద్దామని ప్రయత్నిస్తే సదరు వ్యక్తి బతికే వున్నట్టు తేలింది. యూపీకి చెందిన 45 ఏళ్ళ శ్రీకేష్ కుమార్ మొరాదాబాద్ లో మోటార్…
మంచుకురిసే వేళలో.. ఉదయాన్నే ఓ కప్పు టీయో, కాఫీయో తాగితే ఆ అనుభూతి గురించి టీ, కాఫీ తాగేవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉదయం మనం తాగే టీ, కాఫీ కంటే వెల్లుల్లి టీ ఎంతో బెస్ట్ అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు ఒక్క కప్పు వెల్లుల్లి టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెల్లుల్లిని మనం రోజు వంటలో ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లి.. వంటకే ప్రత్యేక రుచిని తెస్తుంది. అలాగే వెల్లుల్లి టీ కూడా ప్రత్యేకమైన…
గుండె లబ్‌డబ్ అని కొట్టుకుంటుంది. డాక్టర్ స్కెతస్కోపుతో గుండె శబ్దాన్ని వినవచ్చు. గుండె కొట్టుకునే సమయంలో వచ్చే శబ్దాన్ని బట్టి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్న పాఠమే. అయితే, గుండె కొట్టుకునే శబ్దాన్ని వినగలం కాని, గుండె శబ్దాన్ని చూడలేం. గుండె చుట్టూ రక్షణగా ఎముకలు వలయంగా ఉంటాయి. గుండె జబ్బులతో బాధపడే వారికి అత్యవసరంగా గుండె మార్పిడి చేయాల్సి రావొచ్చు. Read: ఆర్టీసి…
ప్రస్తుతం ప్రపంచం అతిపెద్ద గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.ఇప్పటివరకూ కోవిడ్ తో సతమతమైన ప్రపంచ దేశాలు.. అంతకన్నా అతిపెద్ద సమస్యనే ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ పేషెంట్.. క్లైమేట్ చేంజ్ వ్యాధి లక్షణాలతో అడ్మిటయ్యాడు. అతడి రోగ లక్షణాలపై పరిశోధన చేసిన డాక్టర్ మెరిట్..వాతావరణ మార్పుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.శ్వాస సమస్యతో వచ్చిన రోగిని పరిశీలించిన డాక్టర్ మెరిట్.. అతడు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. పేలవమైన గాలినాణ్యత, హీట్‌వేవ్..…
ప్రజల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఆరోగ్యం అందించే సమగ్ర ఆచరణ సాధ్య నమూనా విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ్. దీని అమలు కోసం తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తా అన్నారు జేపీ. ఇది ఆచరణసాధ్య నమూనా అన్నారు. ఉచిత డయగ్నస్టిక్, ఉచిత పరీక్ష, ఆరోగ్యశ్రీ లో నుంచి తృతీయ స్థాయి వైద్యాన్ని తొలగించాలి. తృతీయ వైద్యానికి భారీగా ఖర్చవుతుంది. అమెరికా ఆరోగ్య రంగంలో 35వ స్థానంలో ఉంది.…
మామూలుగా అందరూ బరువు తగ్గడానికి చాలా రకాల డైట్లు ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా చాలా మంది ఆహారాన్ని తినడం తగ్గించి బరువు తగ్గుదామనుకుంటే అది పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శరీరానికి అవసరమైనంత పోషకాలు అందకపోతే రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారినపడే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పాటించే డైట్లో కొన్ని ఆహర పదార్థాలను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం తినే డైట్లో ఏదైనా పండ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత పోషకాలు అందుతాయని…