తెలంగాణలో షాకింగ్ సర్వే.. వారికి ఆ లక్షణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. అయితే ఒకరోజు తగ్గితే మరోరోజు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం రాష్ట్రంలో 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,393 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212 కాగా, మరణాల సంఖ్య 4,071గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,95,942గా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 31,199 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
శనివారం మొత్తం 1,16,224 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,12,85,422 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జ్వరం, ఇతర లక్షణాలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వేలో ఎన్నో విభ్రాంతికర విషయాలు బయటపడుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒక్కరు జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆరోగ్య సిబ్బంది గుర్తించారు.
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో 30 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు. సర్వేకి వెళ్లిన సిబ్బందితో మాట్లాడిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది. జనంలో చాలామందికి జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించి, వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను అందించారు. ప్రతి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువ మంది ప్రైవేటు క్లినిక్ లను ఆశ్రయిస్తుండడంతో అవన్నీ లెక్కల్లోకి చేరడం లేదు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!