పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ…
జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, మన ఊరు – మన బడి ని సమర్థవంతంగా అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. దేశంలో విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాల హక్కులు హరించి విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచేది, లౌకిక తత్వానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్రంలో అమలు జరపకుండా తిరస్కరించాలి.…
శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.…
శరీరంపై ఆదనంగా ఏవైనా అవయవాలు ఉంటే వాటిని ఎలాగైనా సరే తీసేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చూసేవారికి ఇబ్బంది లేకపోయినా, వాటిని మోస్తూ తిరిగేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నచిన్న ఇబ్బందులు అంటే సరేలే అనుకోవచ్చు. కానీ, శరీరంపై మోయలేనంతగా అవయవాలు పెరిగిపోతే ఇంకేమైనా ఉందా చెప్పండి. గుజరాత్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ పొత్తి కడుపులో ఓ ట్యూమర్ ఏర్పడింది. ఆ ట్యూమర్ క్రమంగా పెరిగిపోతూ వచ్చింది. ఎంతగా పెరిగింది అంటే సుమారు 47 కేజీలు పెరిగింది. కడుపు పెద్దదిగా…
శ్రీహనుమాను గురుదేవ చరణములు.. ఇహ పర సాధక శరణములు… అంటూ మంగళవారం శ్రీహనుమాన్ చాలీసా పఠిస్తే చాలు మీ బాధలు అన్నీ మటుమాయం అవుతాయి. ఆ చిరంజీవి కరుణాకటాక్ష వీక్షణాలు లభిస్తాయి. అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు చేకూరుతాయి.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో ఆల్కాహాల్ ఒకటి. దీని ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తుంది. అయితే, ఆల్కాహాల్ తీసుకున్న తరువాత మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై వైద్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. మగ్గబెట్టిన పండ్లు, ధాన్యం, కూరగాయలతో మద్యాన్ని తయారు చేస్తారు. వీటిని మగ్గబెట్టినపుడు దాని నుంచి ఈస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఈస్ట్ నుంచి అల్కాహాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఈస్ట్ నుంచి ఈథనాల్ కూడా ఉత్పత్తి అవుతుంది. మద్యాన్ని సేవించిన…
చిన్న వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ మరో వేరియంట్ రూపంలో ముంచుకొచ్చి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే, త్వరలోనే దీని పీడ విరగడ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనంటోంది. ఇంతకీ కరోనా ముప్పు ముగిసినట్టా? కాదా? మున్ముందు రాబోయే వేరియంట్ల గురించి WHO చెబుతున్నదేమిటి? రోజులు… వారాలు… నెలలు… దాటి ఏకంగా రెండేళ్లను మింగేసింది కరోనా…
కరోనా మహమ్మారి విషయంలో కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్షన్‌ను పక్కన పెట్టింది. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. ఏడు రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆన్‌లైన్ డిక్లరేషన్ ఫామ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో రెండు వారాల ట్రావెల్ హిస్టరీ…