Motion Sickness: కొందరు ప్రయాణం చేయడానికి భయపడుతుంటారు. వీరు వాహనాల్లోకి ఎక్కిన వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభమవుతోంది. దీన్ని ‘మోషన్ సిక్నెస్’గా పిలుస్తుంటారు. మైకం, వికారం, వాంతులు, చెమటలు పట్టడం వంటివి దీనికి లక్షణాలు. అయితే ప్రయాణించేటప్పుడు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మన భారతీయ ఆయుర్వేద వైద్యంలో మంచి నివారణలు ఉన్నాయి. వంటింటి చిట్కాలను వాడి ఈ మోషన్ సిక్నెస్ లేదా ట్రావెల్ సిక్నెస్ని దరికి రానీవ్వకుండా చేయొచ్చు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Vegetarian: ప్రపంచం మొత్తంలో మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు చాలా తక్కువ. కొంతమంది తమ ఆరోగ్యం కోసం మాంసాహారాన్ని వదిలేసి వెజిటేరియన్స్గా మారుతుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో శాకాహారులుగా ఉండేందుకు మన డీఎన్ఏలోని జన్యువులు కూడా కారణమవుతాయంటే ఆశ్చర్యకలగక మానదు. తాజాగా ఓ స్టడీలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కొరియన్ అమ్మాయిల అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ దేశ మహిళలు చాలా అందంగా కనిపించడమే కాకుండా గాజులాంటి మెరుస్తున్న చర్మం అందరినీ వెర్రివాళ్లను చేస్తుంది. కొరియన్ అమ్మాయిల ముఖాలపై ఒక్క మచ్చ కూడా కనిపించదు. దాని రహస్యం ఆమె బ్యూటీ ప్రొడక్ట్స్లో కాదు వారు తాగే టీలో దాగి ఉంది.
Side Effects Of Eating Apples: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం రాదు అంటూ మనకు సామెత కూడా ఉంది. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా యాపిల్ ను తింటూ ఉంటారు. ఎవరికైనా ఆరోగ్యం పాడైతే యాపిల్స్ తినిపిస్తూ ఉంటారు. అనారోగ్యం పాలైనప్పుడు ప్రధానంగా తినే పండ్లలలో ఇది ఒకటి. దీనిలో ఉండే ఏ విటమన్ కంటికి చాలా మంచిది. అంతేకాకుండా దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, విటమిన్లు…
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది.
Precautions To take for Liver Health: కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి, శక్తిగా మార్చి, వ్యర్థాలను బయటకు పంపడంలో దీని పాత్ర ప్రధానమైనది. అందుకే లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే కాలేయం పాడైపోయేటప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తం నుంచి టాక్సిన్లను కాలేయం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంటుంది. అయితే ఒకవేళ…
Diabetes: రాత్రిపూట మేల్కొని ఉండటం పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మన జీవగడియారం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో నిద్రపోకుండా మెలుకువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రిళ్లు మేలుకుని ఉండే నిద్రా విధానాన్ని ‘క్రోనోటైప్’ ని పిలుస్తారు. ఇది డయాబెటిస్ని పెంచుతుంది
Smoking: స్మోకింగ్.. సిగరేట్లను పీల్చుతూ సరదాగా రింగురింగులుగా వదులుతుంటారు. ఈ సరదానే తరువాత అలవాటుగా మారుతుంది. స్మోకింగ్ వల్ల దీర్ఘకాలంగా పలు వ్యాధులకు కారణమౌతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. క్యాన్సర్లకు కారణమవుతుంది. ఇదిలా ఉంటే ఇది మీ యవ్వనాన్ని కూడా ఖర్చు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యానికి కూడా కారణమవుతుందని తాజా స్టడీలో తేలింది. పొగతాగడం వల్ల త్వరగా ముసలివాళ్లు అవుతారని చెబుతోంది.
Cancer Symptoms: ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో, ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావడం లేదు. మన ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారికి అకస్మాత్తుగా క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు. క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇక…