Holding Sneeze: తుమ్మును ఆపుకోవాలని చూస్తే ప్రమాదమే.. ఏకంగా శ్వాసనాళం పగిలిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holding Sneeze: తుమ్ములు వస్తే ఆగవు, అయితే కొన్ని సందర్భాల్లో ముక్కు నలవడం ద్వారా ఆపుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఓ కేసులో మాత్రం తుమ్ముని ఆపుకోవడం ఏకంగా ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది. తుమ్మును అదిమిపెట్టడంతో ఒక్కసారిగా అతని శ్వాసనాళంపై ఒత్తడి పెరిగి పగిలిపోయింది. అత్యంత అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే ఇలాంటి కేసు ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. లైవ్ సైన్స్‌లో ఒక నివేదిక ఈ కేసును ప్రస్తావించింది. వివరాల్లోకి వెళితే సదరు వ్యక్తి కారు నడుపుతున్న సమయంలో తుమ్ము రావడంతో దానిని ఆపుకునేందుకు ప్రయత్నించారు. మామూలుగా తుమ్ములు వచ్చిన సమయంలో ముక్కు నలవడం చేయడం ద్వారా అడ్డుకుంటాము. అయితే ఈ ఘటనలో మాత్రం ముక్కును, నోటిని పూర్తిగా మూసేశాడు. దీంతో అతనికి ఇదే ప్రాణాంతకంగా మారింది. తుమ్మును ఆపుకోవడంతో ఒక్కసారిగా దాని శక్తి అతని శ్వాసనాళంపై పడింది. దీంతో 2 మిల్లీ మీటర్ల మేర శ్వాసనాళం పగిలిపోయి రంధ్రం పడింది. వాయునాళం మూసేయడం ద్వారా ఒత్తిడి పెరిగి, సాధారణంగా 20 రెట్ల కంటే ఎక్కువ బలంగా ఉండే తమ్మును ప్రేరేపించింది. దీని వల్ల భయంకరమైన నష్టం జరిగింది. దీంతో 0.08 ఇంచుల మేర వాయునాళం చింపేయబడింది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
Read Also: High Court: రేప్ బాధితులకు గర్భం తొలగించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలియజేయాలి..
దీంతో భరించలేని నొప్పి, మెడ రెండు వైపుల వాచి ఉండటంతో డాక్టర్‌ని సంప్రదించాడు. వైద్యుడు పరిశీలించగా.. చిన్నపాటి చప్పుడు వినిపించింది. అయితే ఆహారం తీసుకోవడం, మాట్లాడటానికి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. వ్యక్తికి సర్జికల్ ఎంఫిసెమా ఉందని ఎక్స్-రే రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఈ వ్యాధిలో చర్మం లోతైన కణజాల పొరల్లో గాలి చిక్కుకుపోతుంది. సీటీ స్కాన్ తర్వాత అతని మెడలో మూడు, నాలుగో వెన్నుపూసల మధ్య చీలిక ఉన్నట్లు తేలింది. ముక్కు, నోరు మూసుకుని తుమ్మును ఆపుకునేందుకు ప్రయత్నించడంతో శ్వాసనాళంలో ఒత్తిడి పెరిగి ఈ నష్ట జరిగినట్లు వైద్యులు నిర్థారించారు.
ప్రస్తుతం సదరు వ్యక్తికి శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయినా కూడా అన్ని శరీర ప్రక్రియలు సరిగా ఉన్నాయనే విషయాన్ని నిర్థారించుకునేందుకు రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి పరీక్షించారు. డిశ్చార్జ్ సమయంలో వైద్యులు నొప్పి, హే ఫివర్ మందులు ఇచ్చారు. రెండు రోజుల పాటు శారీరక శ్రమకు దూరంగా ఉండాలని సూచించారు. ఐదు వారాల తర్వాత సీటీ స్కాన్ చేయగా.. చిరిగిన భాగం పూర్తిగా నయమైనట్లు తేలింది. నోరు, ముక్కు మూసుకుని తుమ్మును ఆపొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. శ్వాస నాళం దెబ్బతినడం చాలా అరుదు, కానీ పూర్తిగా అసాధ్యం మాత్రం కాదని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!