Global Survey : మన శరీరంలో ఒక వైరస్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ ప్రమాదకరమైన రూపాన్ని సంతరించుకుంటుంది. ఇటీవలి సర్వే ప్రకారం.. ఈ వైరస్ 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 90శాతం మంది భారతీయుల శరీరంలో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 56.6శాతం మందికి దాని గురించి తెలియదు. ఈ వైరస్ వరిసెల్లా-జోస్టర్. ఇది ఒకప్పుడు చికెన్‌పాక్స్‌కు కారణమైంది. ఇప్పుడు శరీరంలో క్రియారహితంగా ఉంది.…
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో 14 వేల మందికి శిక్షణ ఇచ్చారు.. ఇంకా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ.. ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా ఉన్న తమకు ప్రభుత్వ గుర్తింపు కావాలంటూ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు.
Delhi : దీపావళికి ముందు దేశంలోని 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు మోదీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ఇప్పుడు ఏ వర్గానికి చెందిన పెద్దలు, వారి ఆదాయంతో సంబంధం లేకుండా, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు. ఇది కణాలను, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. అయితే, శరీరంలో దాని పరిమాణం పెరిగినప్పుడు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. శరీరంలో సురక్షితమైన కొలెస్ట్రాల్ స్థాయి వయస్సుతో మారుతుంది. చెడు జీవనశైలి ఫలితంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది, అయితే, మందులు తీసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అయితే, ఈ మందులను ప్రతిరోజూ తీసుకోవాలి.. వీటితో సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే.. కొన్ని సహజ పద్ధతులను…
ఈరోజుల్లో చదవడం కన్నా ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వడం కష్టం అన్న విషయం తెలిసిందే.. అయితే డ్రెస్సింగ్ విషయంలోనే కాదు.. ఫుడ్ తీసుకొనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. పొట్టలో గడబిడగా ఉన్నట్లు, కడుపులో నుంచి శబ్దాలు, నోటి నుంచి బ్రేవ్ మనే సౌండ్స్ వస్తే.. ఇంటర్వూ చేసే వ్యక్తి మిమ్మల్ని వింతగా, అశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మీకు ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. మీరు ఇంటర్వ్యూకు వచ్చే ముందు తిన్న ఆహారం వల్ల…
చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ చలికాలంలో రోజూ తినవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులోని గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యలను నయం చేస్తాయి. అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు కాల్షియం తగిన మోతాదులో ఉంటాయి. కాబట్టి దీన్ని రోజూ తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది మరియు శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది. అరటిపండులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిని రోజూ తినడం…
చలికాలంలో చర్మం పగలడం కామన్.. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. చలికి చర్మం నిర్జీవంగా మారుతుంది.. చర్మాన్ని మృదువుగా మార్చేందుకు ఎన్నెన్నో లోషన్లు రాసుకుంటారు.. అయిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.. కాసేపటికే చర్మం మళ్లీ పొడి బారుతుంది.. ముఖ్యంగా స్కిన్ డ్రైగా మారిపోతూ ఉంటుంది. దురద వస్తుంది. చలికాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు మన చర్మాన్ని సాధారణం కంటే మరింత సున్నితంగా మార్చగలవు కాబట్టి మన చర్మానికి అదనపు సంరక్షణ అవసరం… చలికాలంలో…
చలికాలంలో చర్మం పొడిబారడం కామన్.. అయితే తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మరి చలికాలంలో చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..వీటిలో విటమిన్ బి3, నియాసిన్ శరీరంపై ముడతలు పోగొట్టడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా కాలం పాటు…
ఆహారాన్ని తినేటప్పుడు ఎప్పుడూ నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఏదైనా ఆహారం తినేప్పుడు.. నీళ్లు తాగడం సహజం. అయితే, కొన్ని ఆహారపదార్థాలు తినేప్పుడు.. నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలా ఆహార పదార్థాలతో నీరు తీసుకోవడం సురక్షితం కాదని అంటున్నారు, వీటి కారణంగా అజీర్ణం, అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కమల, ద్రాక్షపండ్లు, బత్తాయి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.…