Skin Care : చలికాలంలో స్కిన్ డ్రై గా మారిందా? ఈ టిప్స్ మీకోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో చర్మం పగలడం కామన్.. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. చలికి చర్మం నిర్జీవంగా మారుతుంది.. చర్మాన్ని మృదువుగా మార్చేందుకు ఎన్నెన్నో లోషన్లు రాసుకుంటారు.. అయిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.. కాసేపటికే చర్మం మళ్లీ పొడి బారుతుంది.. ముఖ్యంగా స్కిన్ డ్రైగా మారిపోతూ ఉంటుంది. దురద వస్తుంది. చలికాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు మన చర్మాన్ని సాధారణం కంటే మరింత సున్నితంగా మార్చగలవు కాబట్టి మన చర్మానికి అదనపు సంరక్షణ అవసరం… చలికాలంలో చర్మం డ్రై అవ్వకుండా ఈ టిప్స్ ను ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు..
సన్‌ఫ్లవర్ ఆయిల్.. పొద్దుతిరుగుడు గింజల నుండి సంగ్రహిస్తారు. చర్మం పై పొరను రక్షిస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. బ్యాక్టీరియా ప్రవేశాన్ని నిరోధించడం ద్వారా చర్మ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.. తామర, సోరియాసిస్ వల్ల వచ్చే మంట , దురదను తగ్గించడానికి మీరు దీన్ని నేరుగా మీ చర్మంపై ఉపయోగించవచ్చు.. వెంటనే ఉపశమనం కలుగుతుంది..
Also Read
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
- Chanakya Niti: చెడ్డ కొడుకు కుటుంబానికి శాపం.. మంచి కొడుకు వంశానికి దీపం!
కలబంద.. న్యాచురల్ మాయిశ్చారైజర్.. దీనిలో చర్మ పోషణకు సంబందించిన అన్ని పోషకాలు ఉంటాయి.. సోరియాసిస్‌తో సంబంధం ఉన్న ఎరుపు, దురద , చర్మపు చికాకులను తగ్గిస్తాయి. ఈ జెల్ విటమిన్ ఎ & ఇ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది, ఇది చర్మానికి అద్భుతమైనది. ఇది 96% నీటిని కలిగి ఉన్న ఆర్గానిక్ మాయిశ్చరైజర్, ఇది హైడ్రేటింగ్ , పొడి , చికాకు నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి..
పసుపు..అనేక చర్మ ఇన్ఫెక్షన్లలో హీలింగ్ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఇది కర్కుమిన్‌తో సమృద్ధిగా ఉంటుంది, ఇది ఇన్ఫ్లమేటరీ సైటోకిన్లను తగ్గిస్తుంది, ఇది సోరియాసిస్ చికిత్సలో సహాయపడుతుంది. పలచబరిచిన పసుపు పేస్ట్‌ను నేరుగా నీరు లేదా నూనెతో అప్లై చేయడం వల్ల ఎరుపు , దురద తగ్గడమే కాదు ఇంకా ఎన్నో సమస్యలు తగ్గుతాయి..
కొబ్బరి నూనె.. కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. రసాయనాలు ఉపయోగించకుండా ప్రాసెస్ చేయబడిన కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను ఎల్లప్పుడూ ఎంచుకోవాలని నిర్ధారించుకోండి… ఇది చాలా మంచిది.. వైద్యులు కూడా కొబ్బరి నూనె వాడమని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
-
AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
-
Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
-
King 100: కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఫీట్.. ఈసారి ‘కింగ్’ కొట్టేస్తాడా?
-
TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!