ఈరోజుల్లో చదవడం కన్నా ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వడం కష్టం అన్న విషయం తెలిసిందే.. అయితే డ్రెస్సింగ్ విషయంలోనే కాదు.. ఫుడ్ తీసుకొనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. పొట్టలో గడబిడగా ఉన్నట్లు, కడుపులో నుంచి శబ్దాలు, నోటి నుంచి బ్రేవ్ మనే సౌండ్స్ వస్తే.. ఇంటర్వూ చేసే వ్యక్తి మిమ్మల్ని వింతగా, అశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితి మీకు ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. మీరు ఇంటర్వ్యూకు వచ్చే ముందు తిన్న ఆహారం వల్ల ఈ వింత పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.. అందుకే ఇంటర్వ్యూ కు వెళ్ళేటప్పుడు కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేయించిన ఆహార పదార్థాల్లో.. నూనె ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్ణం, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి మీ కడుపులో రంబ్లింగ్ శబ్దాలను కూడా కలిగిస్తాయి, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు కచోరీ, ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడి వంటి ఫుడ్స్ ను అసలు తీసుకోకండి..
సాదారణంగా రిఫ్రష్‌గా ఉండటానికి.. కాఫీ, టీ లాంటి కెఫిన్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఇవి తాగితే.. మీ ఏకాగ్రత దెబ్బతింటుంది.. అందుకే ఎప్పుడు కాఫీ జోలికి అసలు వెళ్లకండి..అలాగే స్వీట్స్, కేక్‌లు, డోనట్స్, చాక్లెట్స్, క్యాండీలు వంటి.. చక్కెర అధికంగా ఉండే ఫుడ్స్ తినొద్దు. ఇవి వికారం, వణుకుతున్న అనుభూతిని కలిగిస్తుంది. వాటికి బదులు ప్రొటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఇవి మమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి..
కూల్ డ్రింక్స్ అసలు తీసుకోకండి.. వీటిలో చక్కెరతో పాటు కార్బన్ డై ఆక్సైడ్ కూడా ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.. అలాగే ఉల్లిపాయలను తీసుకోకండి.. ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న వంటకాలను తినకుండా ఉండటం మంచిది. ఈ రెండు ఆహారాలకు ఘాటైన వాసన ఉంటుంది, ఇవి నోటిద దర్వాసనకు కారణం అవుతాయి.. అందుకే అస్సలు తీసుకోకపోవడమే మంచిది.. ఈ ఆహారాలను అసలు తీసుకోకండి..