ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం ఇంకా పరిష్కారం కాకముందే.. ఓయూ భూవివాదం తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి.
హర్యానా యమునా నగర్ ర్యాలీలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసిన మోడీ.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మోడీ అన్నారు. అలాగే.. హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూములపై తొలిసారిగా స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుందని విమర్శించారు.
KTR : ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది. ఎన్నికల్లో గెలుస్తామో లేదో కూడా తెలియదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీ హామీల మీద హామీలు గుప్పిస్తుంది. అధికారంలోకి వస్తే తాము ఇది చేస్తాం అది చేస్తామంటూ చెబుతోంది. ఇలా హామీలు ఇవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా లేదా క్యాడర్లో కాన్ఫిడెన్స్ కోసమే ఈ హామీలు ఇస్తున్నారా…? పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జనాల…
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో…
Etela Rajender : ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని…
సీపీఐ నేత నారాయణ హెచ్‌సీయూ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో హెచ్‌సీయూ కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడిందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు…
Mahesh Goud: తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన బీసీ రిజర్వేషన్లపై టీపీసీసీ నేత మహేష్ గౌడ్ స్పందించారు. రాహుల్ గాంధీ బీసీ గర్జనకు హాజరవుతారని కాంగ్రెస్ ఎప్పుడు ప్రకటించలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుతో సంబంధం ఉన్న అంశాల కారణంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఇస్తారని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాదులోని HCU భూములపై ఇటీవల జరుగుతున్న చర్చ పై కూడా…
Jagadish Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూములపై హెచ్‌సీయూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆ భూముల్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అక్కడి భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అలాగే మరోవైపు జంతువులు, పర్యవరణానికి ప్రమాదం తేవద్దంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై సినీనటి…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్‌లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?”…