Jagadish Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులని పెయిడ్ బ్యాచ్ అంటూ పిలవడం దారుణం అని పేర్కొన్నారు. పేమెంట్లతో పదవులు తెచ్చుకున్న మీరు విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదు అని తేల్చి చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపండి అని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం మాట్లాడారు.. ఈయన కూడా పేమెంట్ లు తీసుకొని మాట్లాడారా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Jupally Krishna Rao: హెచ్సీయూలో ఇంచు భూమి కూడా తీసుకోలేదు.. చెట్లు పెరిగితే అడివైతదా..?
ఇక, భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. ఒక్క నిమిషంలో పోలీసులను బయటకు పంపొచ్చు అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. కానీ, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తుంది.. బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఈ విషయంలో బయట పడింది అని ఆరోపించారు. డ్రోన్ కెమెరాలు ఎగరేస్తే 500 రూపాయల ఫైన్ వేయొచ్చు అని సీఎం అన్నారు.. కానీ, ఇప్పుడు డ్రోన్ లు ఎగుర వేశారని విద్యార్థులను అరెస్ట్ చేశారు అని పేర్కొన్నారు.