HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులను మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ, తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) కస్టడీ పిటిషన్‌ను మల్కాజ్‌గిరి కోర్టులో దాఖలు చేసింది.
సీఐడీ తమ పిటిషన్‌లో నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ కస్టడీ పిటిషన్‌పై నేడు మల్కాజ్‌గిరి కోర్టు విచారణ జరిపనుంది. విచారణ అనంతరం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.
హెచ్‌సీఏ వ్యవహారాలపై విచారణ చేస్తున్న సీఐడీ, అసోసియేషన్ పేరుతో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించింది. హెచ్‌సీఏకి వచ్చిన నిధుల దుర్వినియోగం, క్లబ్బులకు జరిగిన నిధుల కేటాయింపు, ఖర్చుల తీరును తేల్చే క్రమంలో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ అవకతవకలకు కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టు అధికారులు భావిస్తున్నారు.
బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి గత రెండు సంవత్సరాలలో హెచ్‌సీఏకి దాదాపు రూ. 300 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ మొత్తంలో ఎన్నికలు, క్లబ్‌లకు నిధుల మంజూరు, ప్రాజెక్టుల కేటాయింపులపై అనేక ప్రశ్నలు నిలుస్తున్నాయి. ఈ అంశాలపై స్పష్టత కోసం సీఐడీ నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని కోరుతోంది.
ఈ కేసు నేపథ్యంలో హెచ్‌సీఏలో ఉన్న లోపాలను సమూలంగా పరిష్కరించాలని, ఆటతో నడిచే వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. H CAలో అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. HCA కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. FIR, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని లేఖలో సీఐడీని ఈడీ కోరింది. సీఐడీ నుంచి వివరాలు రాగానే కేసు ఈడీ నమోదు చేయనుంది.
Ajit Doval: “భారత్ నష్ట పోయినట్లు ఒక్క ఫొటో చూపించండి”.. మీడియాపై అజిత్ దోవల్ ఫైర్..