వేల మంది హిందూ మహిళల మత మార్పిడి.. ఛంగూర్ బాబా నెట్వర్క్..
జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడిలు చేస్తున్న ముఠాకు కీలకంగా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడవుతోంది. హిందూ, సిక్కు మహిళలే లక్ష్యంగా భారీ మతమార్పిడి నెట్వర్క్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది. బలవంతం, ప్రలోభం ద్వారా 1,500 మందికి పైగా హిందూ మహిళలను మరియు వేలాది మంది ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చినట్లు తెలిసింది. పేదలు, వితంతువులు, నిస్సహాయ మహిళలతో సహా బలహీన వర్గాలను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లవ్ జిహాద్ ద్వారా హిందూ, సిక్కు యువతులను, మహిళలను ఇస్లాంలో మార్చేందుకు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తేలింది. కులాల ఆధారంగా హిందూ మహిళల్ని మతం మార్చినవారికి లక్షల్లో రూపాయాలను ఇస్తున్నట్లు వెల్లడైంది.
మరో భర్త బలి.. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు దారుణంగా..
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భార్యలు, భర్తలను చంపుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? భర్తలను చంపి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది ఓ భార్య ఈ ఘటన ఉన్నావ్ లో చోటుచేసుకుంది. జాజ్‌మౌ ప్రాంతంలోని ఇఖ్లాక్ నగర్‌లో నివసిస్తున్న ఇమ్రాన్ అలియాస్ కాలేను అతని భార్య తన ప్రేమికుడు, అతని సహచరుడితో కలిసి హత్య చేసింది. పోలీసులు భార్య, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు.
హెచ్‌సీఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. రూ.170 కోట్లు స్వాహా!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావును తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో.. జగన్‌మోహన్‌ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. జగన్‌మోహన్‌తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అరెస్ట్ చేసి విచారించింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్న GHMC
హైదరాబాద్ నగరంలో పేదల ఆకలిని తీరుస్తూ సేవలందిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు ఇప్పుడు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ఈ క్యాంటీన్లలో కార్మికులు, విద్యార్థులు, పేద ప్రజలు రోజూ కేవలం రూ.5కే భోజనం చేస్తుండగా.. ఇప్పుడు వాటిని “ఇందిరమ్మ క్యాంటీన్లు”గా మారు రూపంలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇక భోజనమే కాకుండా ఉదయాన్నే టిఫిన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇడ్లీ, ఉప్మా, పులిహోర వంటి సాంప్రదాయ టిఫిన్లు మెనూలో చేర్చాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా, నగరంలో కొత్త క్యాంటీన్ల అవసరం తలెత్తడంతో ప్రభుత్వం 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం మొత్తం రూ.11.43 కోట్లు ఖర్చుచేయనున్నారు.
భారతీయులకు రష్యా బంఫర్ ఆఫర్.. 10 లక్షల మందికి ఉద్యోగాలు..?
ప్రపంచంలో పలు దేశాలు భారతీయ కార్మికులు, ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. యూఏఈ, ఖతార్, ఇజ్రాయిల్ వంటి దేశాలు భారతీయ కార్మికులను నియమించుకుంటున్నాయి. అక్కడి భవన నిర్మాణ రంగాల్లో, వస్త్ర పరిశ్రమ, వ్యవసాయం, ఇతర పరిశ్రమల్లో భారతీయులను రిక్రూట్ చేసుకుంటున్నారు. యూకే, అమెరికా వంటి దేశాలు భారతీయ వృత్తి నిపుణులను ఆహ్వానిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు రష్యా కూడా భారతీయులను సాదరంగా స్వాగతిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధ కారణంగా రష్యాలో కార్మికుల కొరత ఏర్పడింది. దీనిని భర్తీ చేసేందుకు భారతీయ కార్మికులను కోరకుంటున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నా్యి. భారతదేశం నుంచి 2025 చివరి నాటికి 10 లక్షల మంది రష్యాకు వస్తారని, రష్యాలోని ఎకటేరియన్ బర్గ్‌లో కొత్తగా భారత కాన్సులేట్ తెరుస్తారని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధిపతి ఆండ్రీ బెసెడిన్ చెప్పారు. దీనిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు.
“రాఫెల్ జెట్”పై చైనా గూఢచర్యం, నలుగురు అరెస్ట్..
జిత్తులమారి చైనా, ఎప్పటికప్పుడు వేరే దేశాల ఆయుధాలను కాపీ కొడుతూ మేడ్ ఇన్ చైనా ఆయుధాలను తయారు చేస్తుంటుంది. అయితే, తాజాగా జరిగిన సంఘటన చూస్తే మరోసారి అదే పనిలో ఆ దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్రెంచ్ తయారీ రాఫెట్ ఫైటర్ జెట్ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు చైనా జాతీయులను గ్రీస్ దేశంలో అరెస్ట్ అయ్యారు. గ్రీస్‌లోని తనగ్రాలో రాఫెల్ ఫైటల్ జెట్స్ ఫోటోలు తీసినందుకు, హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(HAI) ఫెసిలిటీని చిత్రీకరించినందుకు అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతంలోని సున్నితమైన సైనిక స్థావరాలను ఫోటో తీస్తున్నట్లు గుర్తించిన తర్వాత అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో గూఢచర్యం చేస్తు్న్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. వీరు తీసిన చిత్రాలను పరిశీలిస్తే రాఫెట్ ఫైటర్ జెట్ ఫోటోలు ప్రముఖంగా కనిపించాయి. పోలీసుల చెబుతున్న దాని ప్రకారం, వీరి వద్ద విస్తృతమైన సైనిక సమాచారానికి సంబంధించిన ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మరోసారి విమర్శలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి!
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్ది ఇలాంటి దాడులు చేయిస్తుందన్నారు. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాకు పరిచయం చేశారని విమర్శించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇప్పుడే వచ్చి అరెస్టు చేసుకోవచ్చన్నారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదం అని ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ‘నాది నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి బ్లడ్. భయపడటం మా బయోడేటాలోనే లేదు. కేసులకు, అరెస్టులకు భయపడే మనస్తత్వం నాది కాదు. నేను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు ప్రచారం చేస్తున్నారు. చేతికి నొప్పి ఉంటే చెన్నైలోని చికిత్స చేయించుకుని వచ్చా. ఆస్పత్రికికి వెళ్తే.. నేను పారిపోయినట్లు ప్రచారం చేశారు. ప్రసన్న కాళ్లు, చేతులు కట్టేసి.. తన కాళ్ల కింద పడేయ్యమని ప్రశాంతి రెడ్ది చెప్పారట. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా, ఎవరోస్తారో రండి. మా ఇంటిపై దాడికి వచ్చిన వారి వీడియోలు ఉన్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి’ అని ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు.
ఫిష్ వెంకట్ కి హీరో ఆర్థిక సహాయం
నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం కూతురు స్రవంతికి PRK హాస్పిటల్ లో రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధ పడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించారు హీరో కృష్ణ. ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ 100 Dreams Foundation లో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు – అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలని సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితం,” అని తెలిపారు.
తాను డైరెక్ట్ చేసిన సినిమా చూస్తూ గుండెపోటుతో డైరెక్టర్ మృతి
తెలుగు సినిమాని విషాదంలోకి నెట్టిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు, తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాదకథ. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) తను డైరెక్ట్ చేసిన సినిమా ‘బ్రహ్మాండ’ ప్రివ్యూ చూస్తుండగా ఊహించని విధంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలగా సినిమా విడుదలకు వారం రోజులే ఉన్న సమయంలో ఆయన మృతితో చిత్రయూనిట్ ఒక్కసారిగా షాక్‌కి లోనైంది. రాంబాబు ఎప్పటికైనా సినిమా తీసి చూపించాలనే పట్టుదలతో బ్రహ్మాండ అనే సినిమా చేసి పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకుని సెన్సార్ కానిచ్చుకుని విడుదలకు సిద్ధం చేశారు! ఆయన దర్శకత్వంలో తొలి సినిమా బ్రహ్మాండ! మంగళవారం రాత్రి ప్రివ్యూ షో చూస్తూ థియేటర్ లోనే చనిపోయారు. ఆ సినిమా అద్భుతంగా వచ్చిందనే ఆనందమో తెలియదు! ఇంకాస్త మెరుగులు దిద్దుకుని ఉంటే బావుంటుందని అనుకుంటూ ఒత్తిడికి గురయ్యారో తెలియదు కానీ మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా తీవ్ర గుండెపోటు కు గురై మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు! నేడు స్వగ్రామం అల్లీపూర్ లో అంత్యక్రియలు జరిగాయి.
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు రిమాండ్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్‌తో పాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్‌గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు చేశారని, పదవి చేపట్టాక భారీగా నిధులు మళ్లించారని జగన్మోహన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి, ఆ పత్రాలను జగన్మోహన్‌కు అందించారని.. ఆ పత్రాలతో హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ను అరెస్టు చేసినట్లు సీఐడీ గురువారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది.