హర్యానాలో ఓటమి తర్వాత కాంగ్రెస్లో ఓటమిపై గుబులు మొదలైంది. సీనియర్ నాయకులు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా పార్టీలోని ఓటమికి అనేక కారణాలలో ఒకటి.
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి హస్తం పార్టీ నేతలు నిరాశ, నిస్పృహలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిమ్మిక్కులు చేసి హర్యానాలో గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది.
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. హర్యానాలో ఈసారి అధికారం కాంగ్రెస్దే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయి., అయితే తీరా ఫలితాలు చూస్తే, బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 37 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, అతివిశ్వాసమే ఆ పార్టీ కొంపముంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ…
జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం.. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా.. హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏను గెలిపించారన్నారు.
Haryana CM Meet PM Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మూడోసారి గెలిచి కాంగ్రెస్ను బీజేపీ మట్టికరిపించింది. ఈ సందర్భంగా ఈరోజు (బుధవారం) హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
హర్యానా ప్రజలకు, కార్మికులకు ప్రధాని అభినందనలు తెలిపారు. మోడీ హర్యానాకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. 'భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ రాయిని వదిలిపెట్టబోమని నేను వారికి హామీ ఇస్తున్నాను'.అని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది.
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానా ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హర్యానా ఫలితాలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఓటింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్.. కౌంటింగ్ రోజు భిన్నమైన ఫలితాలు రావడంతో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి అధికారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ పూర్తి ఆశలు పెట్టుకుంది కానీ అది జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందో అని ఎన్నికల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ఓటమికి ఈ అంశాలు ప్రముఖంగా నిలిచాయి.