హర్యానాలో బీజేపీ నేత, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సుఖ్‌బీర్ ఖతానాపై తూటాల వర్షం కురిపించారు.
నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో ప్రధాన నిందితులు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాంగ్వాన్‌లను 10 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. గోవాలోని అంజునా బీచ్‌లో కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌తో పాటు మాదకద్రవ్యాల వ్యాపారి దత్‌ప్రసాద్ గాంకర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్‌లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు.
Business Flash: స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌కి యూజర్లు తగ్గినా షేర్లు పెరగటం విశేషం. 9 లక్షల 70 మంది సబ్‌స్క్రైబర్ల తగ్గుతారని సెకండ్ క్వార్టర్ ఆదాయ నివేదికలో వెల్లడించింది. ఫస్ట్ క్వార్టర్‌లో 2 లక్షలు తగ్గొచ్చన్న అంచనాలతో పోల్చితే ఇది తక్కువే కావటం గమనార్హం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్‌లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రేపటి నుంచి ఈ నెల 13 వరకు హర్యానాలోని పంచకులలో ప్రారంభం కానున్నాయి. 25 క్రీడావిభాగాల్లో మొత్తం 4,700 మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా.. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్‌తో పాటు ఇతర క్రీడలను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో నిర్వహించనున్నారు. అంబాల, షాహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీలోని మైదానాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి. COMMONWEALTH…
ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులను తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు…
పరీక్షలలో కొందరు విద్యార్థులకు సబ్జెక్ట్ రాకపోవడంతో విచిత్రంగా ఏదో ఒకటి రాసేస్తుంటారు. ఇలాంటి వాళ్లు పేపర్లు దిద్దే టీచర్లు దయతలచి తమను పాస్ చేయలేకపోతారా అని ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే తమకు పాస్ మార్కులు వేయాలని కొందరు విద్యార్థులు జవాబు పత్రాల ద్వారా విజ్ఞప్తి చేస్తుంటారు. మరికొందరు మంచి మార్కులు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతుంటారు. తాజాగా హర్యానాలో జరుగుతున్న బోర్డు పరీక్షల్లో ఓ యువతి రాసిన మ్యాటర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.…
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అవుతుంది అనుకున్న ఆమ్ఆద్మీ పార్టీ.. క్రమంగా విస్తరణ చర్యలు ప్రారంభించింది.. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తిరుగులేని విజయాన్ని అందుకుని ఔరా..! అనిపించింది.. ఈ విజయం ఆ పార్టీ నేతలకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.. పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఇదే సమయంలో 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇవాళ హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్ తీర్థం…
అత్యవసర సమయాల్లో సహాయం కోసం ప్రతీ రాష్ట్రం ఒక్కో నెంబర్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఆ నెంబర్‌కు డయల్ చేస్తే పోలీసులు స్పందించి సహాయం చేస్తారు. అయితే, కొంతమంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరదాగా కాల్ చేసి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఇటీవలే హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 112ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఓ తాగుబోతు కాల్ చేశాడు. కాల్ చేసి సహాయం కావాలని…