Red Sandal Smuggling: పుష్ప తరహాలో ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. దక్షిణాది నుంచి అక్రమంగా తరలించిన ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కొట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హర్యానాల్లో దేశం దాటించేందుకు గోదాముల్లో సిద్ధంగా ఉన్న ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: UnStoppable 2: ఇండస్ట్రీలోనే మొదటిసారి.. బాలయ్య షోకు పవన్.. ?
10 కోట్ల విలువ చేసే 15 టన్నుల ఎర్ర చందనాన్ని సీజ్ చేశారు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు. ఎర్ర చందనాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ముంబై, హర్యానాల్లో దాడులు చేశారు. ముంబైలోని ఓ గోదాంలో దాడులను నిర్వహించారు అధికారులు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న కంటైనర్ ను అడ్డగించారు కస్టమ్స్ అధికారులు. కంటైనర్ లో సుమారుగా 2.5 కోట్ల విలువ చేసే 3030 కేజీల ఎర్ర చందనం దుంగలను గుర్తించారు ఎంఎస్ వైర్ నెయిల్స్ పేరుతో కంటైన్ బుక్ అయినట్లు అధికారులు గుర్తించారు. హర్యానా పాల్వాల్ లో కూడా ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. 7.5 కోట్ల విలువైన 10.23 టన్నుల ఎర్ర చందనాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు ముఠా సభ్యులు. విశ్వసనీయ సమాచారం రావడంతో అధికారులు దాడులు చేసి ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.