కొత్త సంవత్సరం వేళ ఢిల్లీలో ఓ యువతిని కారుతో దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో భయంకరమైన ఘటన హర్యానాలో జరిగింది. తన ద్విచక్రవాహనం ఎక్కడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఓ మహిళను హెల్మెట్‌తో దారుణంగా చితకబాదాడు.
Rahul Gandhi criticizes Prime Minister Narendra Modi: భారత్ జోడో యాత్రలో మరోసారి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ, బీజేపీ పాలనపై శుక్రవారం విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో రెండు భారతదేశాల ఉన్నాయని.. ఒకటి రైతులు, కార్మికులు, నిరుద్యోగులతో కూడినది అయితే రెండోది 100 మంది ధనవంతులకు చెందినదని.. వీరి చేతుల్లోనే దేశ సంపద సగం ఉందని అన్నారు. హర్యానా పానిపట్ లో జరిగిన ర్యాలీలో అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళా కోచ్, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం పేర్కొన్నారు.
శుక్రవారం జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదు మేరకు హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
Haryana Sports Minister Sandeep Singh booked for harassment: హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మహిళా జూనియర్ కోచ్ పోలీసులకు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చండీగఢ్ పోలీసులు శనివారం సందీప్ సింగ్ పై వేధింపులు, అక్రమంగా నిర్భందించడం, లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అయిన సిందీప్…
3.8 Magnitude Earthquake In Haryana, Tremors Felt In Delhi: కొత్త సంవత్సరంలో మొదటి రోజే భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ లో రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం ధాటికి ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. హర్యానా భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించలేదు. భూ ఉపరితలానికి 5 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. అంతకు…
హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తామని చండీగఢ్ పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గురువారం ఈ ఆరోపణ చేయగా, ఒక రోజు తర్వాత ఆమె ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది.
Haryana Roadways Honours Driver, Conductor Who Rescued Rishabh Pant: భయంకరమైన కారు ప్రమాదం నుంచి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డారు. అతడిని కాపాడి హీరోలుగా నిలిచారు బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్. వీరిద్దరే లేకుంటే రిషబ్ పంత్ ప్రాణాలతో ఉండే వారు కాదని తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ ను కాపాడిని వీరిద్దరు అసలైన హీరోలుగా నిలిచారు. తాజాగా హర్యానా రోడ్ వేస్ శుక్రవారం వీరిద్దరిని సన్మానించింది. రాష్ట్రప్రభుత్వం కూడా…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టింది. హర్యానాలోని బదర్పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది.
దేశంలో ఏదో ఓ మూలన మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అటువంటి ఘటనలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హర్యానాలోని రేవారిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.