BJP is leading in four seats in the by-elections: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీతో నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సున్నితంగా మందలించారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.
దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించడం వల్ల గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిన వారం రోజుల అనంతరం వాటి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.
Ravan idol: దసరా వేడుకల భాగంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమాల్లో కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. దిష్టిబొమ్మను దహనం చేయడంతో నిప్పు రవ్వలు ఎగిరి జనంపై పడ్డాయి.
Chandigarh Airport To Be Renamed After Bhagat Singh: చండీగఢ్ విమానాశ్రయానికి పేరు మార్పు గురించి హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతుల నేపథ్యంలో విమానాశ్రయం పేరును ‘‘ భగత్ సింగ్’’గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రకటించారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా.. చండీగఢ్ విమానాశ్రయం పేరును ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ గా మార్చుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.
CM KCR Tour Haryana: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవీలాల్ 108వ జయంతి సందర్భంగా ఈనెల 25న హరియాణాలో జరిగే సమ్మాన్ దివస్లో CM KCR పాల్గొననున్నారు. మాజీ CM ఓంప్రకాశ్ చౌతాలా ఆహ్వానం పంపినట్లు TRS వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల CMలు, ముఖ్యనేతలు హాజరవుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న KCR.. ఇటీవల నితీశ్, తేజస్వీ, కుమారస్వామి, శంకర్సిస్ట్లతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్…
Red Sandal Smuggling: పుష్ప తరహాలో ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు కస్టమ్స్ అధికారులు. దక్షిణాది నుంచి అక్రమంగా తరలించిన ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కొట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హర్యానాల్లో దేశం దాటించేందుకు గోదాముల్లో సిద్ధంగా ఉన్న ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్నగర్ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు.