గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. తురకపాలెం మెడికల్ క్యాంప్‌కు వచ్చిన హర్షకుమార్.. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్న హర్షకుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తురకపాలెం మరణాలకు కారణాలు డాక్టర్లు చెప్పలేక పోతున్నారు.. ఐసీఎంఆర్ టీంలు వచ్చినా కారణాలు తేలలేదు. దళితులు ఉన్న ప్రాంతాలలోనే మరణాలు సంభవించాయి అని ఆరోపించారు...
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపటానికి ఇబ్బంది ఏమిటి..? అంటూ ప్రశ్నించారు.
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ బనకచర్లపై సంచలన ఆరోపణలు చేశారు.. జేబులు నింపుకోవడానికే 81 వేల కోట్లతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని విమర్శించారు హర్షకుమార్. ముందు పోలవరం పూర్తి చేయకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
ప్రవీణ్ పగడాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేవారు. మాజీ ఎంపీ హర్ష కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును నేను నమ్మడం లేదన్నారు.. రోడ్డు ప్రమాదం కాదు కచ్చితంగా హత్యే నంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని నా అనుమానం అన్నారు.
జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయమని అభిప్రాయపడ్డారు జీవీ హర్ష కుమార్.. కానీ, గతంలోని ఢిల్లీలో మూడు సీట్లు వచ్చినా బీజేపీకి ప్రతిపక్షహోదా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం జగన్ ను చూసి భయపడుతోందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు.
విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.. మాజీ ఎంపీ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది హనీ ట్రాప్ కేసు.. మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు బాధితులు.. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
మాజీ మంత్రి లగడపాటి రాజగోపాల్.. రాజమండ్రిలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే, రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది.. నేను ఇకపై ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోను అని స్పష్టం చేశారు లగడపాటి.. కానీ, తనతో పాటు గతంలో ఎంపీలుగా పనిచేసిన హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఆయన భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీలో పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ పొత్తుల మీదే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ప్రజాసమస్యలు వదిలేసి మూడు ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని.. ఇప్పటి నుంచే పొత్తుల గురించి చర్చలు ఎందుకుని హర్షకుమార్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు జనసేన అధినేత పవన్…