Harsha Kumar: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం.. రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారు..?
- ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం..
- రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారు..
- భవిష్యత్ కార్యాచరణపై రేపు విజయవాడలో సమావేశం నిర్వహిస్తామన్న మాజీ ఎంపీ హర్షకుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsha Kumar: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన విషయం విదితమే.. వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై∙చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.. అయితే.. ఎస్సీల్లోని కొన్ని వర్గాలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు.. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.
ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా ఫైర్ అయ్యారు హర్షకుమార్.. భవిష్యత్ కార్యాచరణపై రేపు మధ్యాహ్నం విజయవాడలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ పై వ్యతిరేకత కారణంగానే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టుకే దిక్కు లేకపోతే నదుల అనుసంధానం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు ఇష్టం లేకపోతే పగటి సమయంలోనే తీసివెయ్యాల్సిందని సూచించారు.. ఇక, విశాఖ పోర్టులో పట్టుబడిన 50 వేల కోట్ల డ్రగ్స్ కేసులో దర్యాప్తు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!