ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత్ కు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటింది. ఇంగ్లాండ్‌పై 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించింది. ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించింది. దీంతో హర్మాన్ ఇంగ్లాండ్‌పై 1000 పరుగులు పూర్తి చేసింది. 70 బంతుల్లో 10 ఫోర్లు బాది 70 పరుగులు సాధించింది.
Also Read:Bhatti Vikramarka : విద్యపై రాజీ లేదు…అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య
వరల్డ్ కప్ లో వెయ్యి పరుగుల మైలురాయి చేరుకున్న హర్మన్ ప్రీత్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మిథాలీ రాజ్ (1321) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్ గా హర్మన్ హిస్టరీ క్రియేట్ చేసింది. కాగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 70 పరుగుల వద్ద ఔటైంది. కౌర్, మంధానతో కలిసి మూడో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 2017లో టౌంటన్‌లో వెస్టిండీస్‌పై మంధాన, మిథాలీ రాజ్ చేసిన 108 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించి, ప్రపంచ కప్ పరుగుల వేటలో ఇది భారతదేశానికి అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.