తెలంగాణ మంత్రులు హరీష్, కేటీఆర్ లకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గోవా, దుబాయ్ లు తిరిగే బదులు.. ఛత్తీస్ ఘడ్ రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారని.. ఛత్తీస్ ఘడ్ వస్తే అక్కడి అభివృద్ధి చూపిస్తానని ఛాలెంజ్ విసిరారు. వరి కాకుండా ఇంకో పంట సాగు చేస్తే… ఎకరాకు 9 వేల సాయం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం చేస్తుందని…
రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, తిరిగి…
వైద్య, ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా వుందన్నారు. ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కళ. రామలింగన్న కోరిక.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వరం దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దుబ్బాక మీద చాలా ప్రేమ వుందన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి సంతోషిస్తాడు. స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో కాని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం…
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో విత్తన ధృవీకరణ సంస్థ నూతన భవన,గోదాము శంకుస్థాపన చేసారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పారుక్ హుసేన్, జెడ్పి చైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లను రద్దు చేశారు. ప్రభత్వలు రైతుల కోసం పనిచేయాలి.…
తెలంగాణ పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామిగా రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తామని టీఆర్ ఎస్ చెప్పిందని.. గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వని దుస్థితి నెలకొందని.. గత ప్రభుత్వం సేకరించిన 78 ఎకరాల భూమిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. కేవలం 5వందల ఇల్లు మాత్రమే నిర్మించారు తప్పితే.. లబ్ధిదారులకు…
తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావడం వల్లనే సిద్దిపేట ప్రాంతం దశ దిశా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద త్రీ స్టార్ టూరిజం హోటల్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టూరిజం శాఖ కార్పోరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణ నుండి హైదరాబాద్ వెళ్ళే వారికి ఈ హోటల్ చాలా…
కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంను వ్యాపార రంగంగా చూడకూడదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన హరీష్ రావు మాట్లాడుతూ… దేశానికి అన్నం పెడుతూ.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. అటువంటి వ్యవసాయంను దండగ అనే స్థితి నుంచి కేసీఆర్ నేడు పండుగగా మార్చారు. పదేళ్ల క్రితం గంజీ కేంద్రాలను పెట్టిన…
పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో నర్సింగ్ కాలేజీ కట్టడం సిగ్గు చేటని, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు బీజేపీ నాయకులతో పాటు, అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని డీకే అరుణ ఖండించారు. తను మంత్రిగా ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, నేడు అదే స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం…
టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మగా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ, అలాంటి సంస్థకు ఛైర్మగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు అని వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.…
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీ వచ్చారని… మంత్రులను కలిసేందుకు సమయం లేదు.. కానీ, బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా? అని నిలదీశారు. రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అని హరీష్రావు మండిపడ్డారు. మంత్రులను పట్టుకొని పనిలేదని అంటారా? ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి…