Thatikonda Rajaiah : స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లను తిట్టడం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఆ నలుగురి దగ్గర అంతరంగికుడిగా ఉన్న కడియం.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరమన ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి, పార్టీకి పుట్టిన పిల్లలను.. కాంగ్రెస్ పార్టీ పిల్లలు అనడం హాస్యాస్పదమని ఆయన సెటైర్ గుప్పించారు. 40 ఏండ్లు కాంగ్రెస్ ఉసెత్తని, కాంగ్రెస్ కు ఓటు వేయని కడియమని, కామెర్లు కమ్మినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
TTD Incidents : టీటీడీ వరుస ఘటనలపై కేంద్రం సీరియస్..
గోబెల్స్ ప్రచారం చేస్తూ…ప్రజల ఉసురు పోసుకుంటున్న కడియం… స్థానిక సంస్థల్లో ఓటు అడిగే ధైర్యం కాంగ్రెస్ వాళ్లకి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరిని గెలిపిస్తా అని మిడిసిపడుతున్న కడియం.. గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు తాటికొండ రాజయ్య. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో అందళం ఎక్కిన కడియమని, ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.
Ration Cards: రేషన్ కార్డుల జారీ పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం