Harish Rao : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు.అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా ఆటగాళ్లు.. వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్
రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హరీష్ రావు అన్నారు. ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదామని, రైతులు అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని పిలుపునిస్తున్నా అని హరీష్ రావు అన్నారు.
Saif Ali Khan Attack: సైఫ్ ఎటాక్ నాటి బట్టలు సేకరించిన పోలీసులు.. ఎందుకంటే?