Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు.. కాళేశ్వరం కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతాం
- కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు
- కాళేశ్వరం కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతాం
- తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని హరీష్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.. కానీ, కేసీఆర్ గారి ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది.. మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 నీటి నిల్వ సామర్ధ్యం ఉంది.
Also Read:Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది.. ఎస్సారెస్పీకి నీళ్లు రానపుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లుంటాయి.. ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ.. వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నం.. మిడ్ మానేర్ లో పంప్ చేసి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీళ్లు తెచ్చుకున్నం.. కాళేశ్వరంలో అంతర్భాగమైన వీటి అంతటా లక్షల ఎకరాల్లో పంటలు పండినయి.. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్లొచ్చినయి.
Also Read:Medak: ప్రాణం తీసిన జ్వరం, దగ్గు సిరప్.. ఐదేళ్ల చిన్నారి మృతి
అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ కు నీళ్లొచ్చినయి.. రంగనాయక సాగర్ మోటార్లతో మిడ్ మానేర్ కు నీళ్లొచ్చినయి..మిడ్ మానేర్ మోటార్లతో మల్లన్నసాగర్ కు, అక్కడి మోటార్లతో కొండ పోచమ్మ సాగర్ కు నీళ్లొచ్చినయి.. ఇదంతా కాళేశ్వరంలో భాగంగానే.. వ్యవస్థ అంతా పనిచేయడం వల్లనే లక్షల ఎకరాల్లో పంట పండింది.. కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదు అంటడు సీఎం రేవంత్ రెడ్డి.. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 50 వేల ఎకరాలు మాత్రమే సాగయింది అంటడు.. ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారింది అంటడు.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు, ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతడు.. కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది..
Also Read:Hanumakonda: వాహ్ ఏం ఐడియా సర్.. అధిక సౌండ్ చేసే సైలెన్సర్లతో ఏం చేశారో చూడండి..
కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది.. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2, నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయింది.. ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది.. కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందిందని తెలిపారు.
Also Read:Secunderabad Railway Station: హనీమూన్ కి బయలుదేరిన యువకుడు.. వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి.. చివరకు
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతాం.. కాళేశ్వరం కమిషన్ కు మేము భయపడ్తున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారు?.. కాళేశ్వరం కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతాం.. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తాం.. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్ళకు మేము భయపడతామా?.. కాంగ్రెస్ ప్రభుత్వం బేషజాలకు పోకుండా మేడిగడ్డ పిల్లర్ రిపేర్ చేయాలి అని ప్రభుత్వానికి సూచించారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!