వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు…
కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వ్యాక్సినేషన్ వేగవంతం చేసే దిశగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ను అనుమతి ఇచ్చిన సర్కార్.. మరోవైపు కరోనా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగిస్తుంది.. దీనిలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్రావు.. సూపర్ స్ప్రైడర్ల లో భాగంగా 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుండి కోవిడ్…
సిద్దిపేట అభివృద్ధిపై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సిద్దిపేట లో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా.? అని ప్రశ్నించిన ఆమె.. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు.. కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్స్ వేసుకుని ఆస్పత్రిలోకి వెళ్తే.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా? రోజు లాక్ డౌన్…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అనంతరం రైతులకు చెల్లింపులకు వీలుగా ముఖ్యమంత్రి 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు 24 గంటల్లో జమ చేయాలన్నదే ధ్యేయం. మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలి. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి. ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ కానీ…
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కరోనా పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్రావు అనంతరం మాట్లాడుతూ… దేశమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నది. గుజరాత్ కి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపించగా, తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించింది అని తెలిపారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు, తెలంగాణ ఈ దేశంలో లేదా, తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని అన్నారు. వ్యాక్సిన్ల విషయంలోనూ…
గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి…