మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. దళితుల ఓట్లను చీల్చేందుకు బిజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని..హుజూరాబాద్‌లో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. మోడీ బొమ్మను, బిజేపీ జెండాను దాచి ప్రచారం చేస్తున్నారని.. బిజేపీకి ఓటువేస్తే పెట్రోల్ ధర రూ.200 దాటిస్తారు,ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని మండిపడ్డారు.
టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ ప్రజలకు ప్రయోజనమని.. మోడీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా? అని నిలదీశారు. గడియారాలు, కుక్కర్లు పంచడమే ఆత్మగౌరవమా? భారతదేశ ఆర్థిక వృద్ది కంటే బంగ్లాదేశ్ మెరుగు గా ఉందని చెప్పారు హరీష్ రావు. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఈటల రాజేందర్ చేసిందేమీ లేదని… అక్కడ జరిగిన అభివృద్ధి, సంక్షేమం అంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే చేపట్టిందన్నారు.