సిద్దిపేటలో టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు బాల్క సుమన్, కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ద ప్రచారం.గొెబెల్స్ బ్రతికి ఉంటే బీజేపీ ప్రచార తీరు చూసి ఉరి వేసుకుంటాడు. 2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి. హుజూరాబాద్ లో అసలు బీజేపీ వాళ్లు ఎం చెప్పి ఓట్లు అడుగుతారు. ఏడాదికి రెండు కోట్లఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు అడుగుతారా… పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా అని అన్నారు.
గత ఏడాది వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కిరాయి ఎకరానికి 3 వేలు ఉంటే, నేడు ఎకరానికి ఐదు వేలు అడుగుతున్నారు. డిజీల్ ధర అరవై రూపాయల నుండి నూటా ఆరు రూపాయల కు పెంచి రైతుల నడ్డి విరిచినందుకు ఓట్లు అడుగుతారా… కేసీఆర్ ఐదు వేలు రైతు బందు కింద రైతులకు ఇస్తే డిజీల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం 2500 రూపాయలు ఇంకో చెత్తో తీసుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతుంది. మళ్లీ సోషల్ మీడియా లో మేం ఉద్యోగాలు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపడుతోంది అని తెలిపారు.
అలాగే ఇప్పటికే లక్షా 30 వేలఉద్యోగాలను భర్తీ చేశాం. త్వరలో మరో 50 నుు చి 60వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి. గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం.. అక్కడి అభివృద్ధి కుంటుపడుతుంది. వ్యక్తిప్రయోజనమా….హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా..అన్న చర్చ పెట్టాలి. దళిత బందు హుజూరాబాద్ లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదన్నారు. బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలి. హుజూరాబాద్లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలి. రైతు బందును హుజూరాబాద్ లో మొట్టమొదటి గా ప్రారంభిస్తే ఆనాడు ఈటల చప్పట్లు కొట్టారు. అదే సెంటిమెంట్ తో హుజూరాబాద్ లో దళిత బందు ప్రారంభిస్తామని సీఎంగారు ప్రకటిస్తే గుండెలు బాదుకుంటున్నారు. కొద్ది మంది బీజేపీ నేతలు ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేశారు. తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం పై ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల దళిత బంధు పథకం ఆగిపోతుందని వీరి ఆశ. రైతుబంధు, దళిత బంధు దండగ అనే బీజేపీ నేత ఈటల కావాలా…తెరాస కావాలా అన్న చర్చ పెట్టాలి. దళితబంధు పెడితే ఎన్నికలకోసం అంటున్నారు. గత మార్చి నెలలో బడ్జెట్ లోనే దళితుల అభ్యున్నతికి 1200. కోట్లతో దళిత్ ఎంపవర్ మెంట్ స్కీం ను ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో నేను ప్రకటించాను. దళితులు బాగుపడటం బీజేపీ కు ఇష్టం లేదు. గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను ఈటల రాజేందర్ పంచుతూ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకే ప్రజలు సీఎం కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకుని, ఆ గడియారాలను పగులగొడుతున్నారు. గెలుపు పక్కా..భారీ మెజారిటీతో గెలుపుకు కృషి చెద్దాం అని పేర్కొన్నారు.