రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు…
కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ కు డబుల్ దమాకా అని… గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇక హుజురాబాద్ కు డోక లేదని మంత్రి హరీష్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపికి మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఇవాళ హుజురాబాద్ నియోజక వర్గంలో పర్యటించిన ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైతు బంధుకు, రైతు ద్రోహులకు మధ్య పోటీ అని తాను అంటున్నానని తెలిపారు. మార్కెట్ యార్డులు రద్దు,…
సెప్టెంబర్ రెండో తేదిన టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ జరుగనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో ఇవాళ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని..ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల, అన్నీ గ్రామాలు, పట్టణాల్లో జెండా…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో PRTU కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు కృతజ్ఞతతో ఉండడం అనేది, ఒక మంచి దృక్పథం, పీఆర్సీ ని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. కరోనా వల్ల కొంత ఆలస్యము జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి పీఆర్సీ 7 న్నర శాతంఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల…
కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా… అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చింది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప…
దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదని… బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకెళుతోందని..అభివృద్ధిపై కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. వారిది అవగాహన రహిత్యమా ? రాజకీయ లబ్ది కోసమా ? కేంద్రం ఇచ్చిన గణాంకాలే చెప్తున్నా ఇలా మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ రెట్టింపు వృద్ధి రేటు సాధించిందని… తలసరి…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ… ఎల్లుండి దళిత బంధు ప్రారంభం అవుతుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ను తీసుకున్నం అని తెలిపారు. బీజేపీ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దళిత బంధు పూర్తి దళిత బంధు కుటుంబాలకు అందిస్తాం. రైతు బంధు అమలప్పుడు కూడా ఇదే దుష్ప్రచారం చేశారు. రైతు బంధు కు చప్పట్లు కొట్టిన నేతలు, దళిత బంధు కు గుండెలు కొట్టుకుంటున్నారు. ఇక హుజురాబాద్ కోసం 2000…
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హరీష్ రావు చేసిన విమర్శలపై అబిడ్స్ లో చర్చకు సిద్దమని..ఎవరిది తప్పు ఐతే వారికి శిక్ష పడుతుందని చురకలు అంటించారు. నా ఆస్తులపై విచారణకు రెడీ అని… సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ తో విచారణ చేద్దామని సవాల్ విసిరారు. పార్టీలో చేరినపుడు ఇప్పుడు ఉన్న ఆస్తులు లెక్క తెలుద్దామని.. మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తాను అభివృద్ది…
హుజురాబాద్ నియోజకవర్గములోని వీణవంక మహిళా సమైక్య సంఘాల మీటింగ్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… నా నియోజకవర్గంలోని ఏ ఊరిలోనూ మహిళా భవనం లేకుండా లేదు. వీణవంక మండలంలోని రెండు గ్రామాల్లోనే మహిళా భవనాలు ఉన్నాయి. రూ. 4 కోట్లతో వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనా నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేస్తాము. మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు పని చేసేవాళ్ళం. ఏడేళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు…