రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. వివాదాల్లోని దేవాలయ భూములకు త్వరలో విముక్తి కలిగిస్తామన్నారు. దేవాదాయ శాఖ జిల్లా అధికారులతో సమావేశమైన కమిషనర్ హరి జవహర్ లాల్ పలు అంశాలు ప్రస్తావించారు. దేవాదాయ భూముల సమస్యలు, ఆడిట్ లెక్కలు, కొత్త జిల్లాల్లో దేవాదాయ శాఖ కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి చర్చించారు.
దేవాదాయ భూములు దేవుడికే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వివాదాల్లో ఉన్న దేవాదాయ భూముల సమస్యలను సత్వరం పరిష్కరించాలి. కోర్టుల్లో ఉన్న దేవాదాయ. ధర్మాదాయ శాఖ భూముల విషయంలో అధికారులు గట్టిగా వాదనలు వివిపించి దేవుడి భూములను రక్షించాలన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ భూములను.. ఆస్తులను సంరక్షిస్తే ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ప్రతిపక్షాలు దేవాదాయ శాఖను టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వని విధంగా విమర్శలకు తావు లేకుండా దేవాదాయ శాఖ అధికారుల పని తీరు ఉండాలని మంత్రి సూచించారు.
Read Also: CM Jagan: హోంశాఖపై సమీక్ష… జగన్ కీలక ఆదేశాలు