ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బౌలింగ్ను ఎంచుకున్నాడు.
టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్ ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు.. ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్ మ్యాన్ లు అయిపోలేరు.. అంటూ ట్రోల్ చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తి్ంపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) లోనూ అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి జట్టులో కనీసం నలుగురు లేదా అయిదుగురు ఆల్ రౌండర్లు కచ్చితంగా ఉంటారు. వీరిలో కొంతమంది మాత్రమే నిలకడైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ లో అందిరి కళ్లు పలువురు ఆల్ రౌండర్లపైనే ఉన్నాయి.
ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే గుజరాత్ టైటాన్స్ టీమ్ సారథి విక్రమ్ సోలంకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ఓపెనర్ గా ఉన్న టీమిండియా బ్యాటర్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ భవిష్యత్ లో గుజరాత్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1 విజయం సాధించిన తర్వాత వన్డే పోరు జరుగుతోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2-1 విజయం సాధించిన తర్వాత, భారత్- ఆస్ట్రేలియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచుల ODI సిరీస్పై దృష్టి సారించింది. రోహిత్ శర్మ తొలి వన్డే నుంచి తప్పుకోవడంతో జట్టును నడిపించే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేతో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ప్రారంభించనుంది. భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
టెస్టు సిరీస్ అయితే గెలుచుకున్నాం.. ఇక ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్ పైనే ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.