Sunil Gavaskar Compares This Young Cricketer With MS Dhoni In Captaincy: మహేంద్ర సింగ్ ధోనీ ఎంత గొప్ప కెప్టెనో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో.. ధోనీ తన సారథ్యంలో టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టాడు. అంతేకాదు.. ఎవ్వరిపై తన అభిప్రాయాలు రుద్దకుండా, తప్పులు దొర్లినా కోపగించుకోకుండా.. చాలా కూల్‌గా నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే.. అతనికి కెప్టెన్ కూల్ అనే పేరొచ్చింది. అతని లాంటి కెప్టెన్ మరొకడు రాడని మాజీలు సైతం కొనియాడారంటే.. ధోనీ కెప్టెన్సీ ఎంత ప్రత్యేకమైందో, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ధోనీకి.. ఓ యువ ఆటగాడు సరితూగుతాడంటూ తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ.. ఆ యువ ఆటగాడు ఎవరనేగా మీ సందేహం! మరెవ్వరో కాదు.. హార్దిక్ పాండ్యా.
Harish Rao : అక్కడ రజినీకి అర్థమైంది.. కానీ ఇక్కడి గజినీలకు ఎందుకు అర్ధమైతలే..
గాయం నుంచి కోలుకొని, భారత జట్టులోకి తిరిగొచ్చినప్పటి నుంచి.. హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తూ.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కి ట్రోఫీ సాధించి పెట్టి, సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరుగడించాడు. కొన్ని అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు సైతం సారథిగా బాధ్యతలు చేపట్టి.. సమర్థవంతంగా జట్టుని ముందుకు నడిపించాడు. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ తన జట్టుని ట్రోఫీ వైపుగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. హార్దిక్ పాండ్యా గురించి సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీలో హార్దిక్ ధోనీలాంటోడేనని పేర్కొన్నాడు. తన వ్యక్తిత్వాన్ని జట్టుపై ఏమాత్రం రుద్దకుండా.. తన గుజరాత్ జట్టుని అతడు సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడంటూ కొనియాడాడు.
Pakistan: మహిళల శవాలపై అత్యాచారం.. సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..
ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు కెప్టెన్లు తమ వ్యక్తిత్వాన్ని, జట్టు వ్యక్తిత్వాన్ని ఒకే విధంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. కెప్టెన్, జట్టు వ్యక్తిత్వాలనేవి భిన్నంగా ఉండవచ్చు. హార్దిక్ మాత్రం తన వ్యక్తిత్వాన్ని జట్టుపై రుద్దడానికి ప్రయత్నించడం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో అతడు చేస్తోంది అదే. హార్దిక్ ఒక కెప్టెన్‌గా ధోనీ మాదిరే ఉంటాడు. ధోనీ నుంచి అతడు మంచి లక్షణాలను పొందాడు. కెప్టెన్‌గా హార్దిక్ తన వారసత్వాన్ని తప్పకుండా వదిలి వెళ్తాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు.