Delhi Capitals Won By 5 Runs Against Gujarat Titans: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలయ్యింది. ఆ జట్టు నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. 125 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 5 పరుగుల తేడాతో డీసీ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (59 నాటౌట్) ఒంటరిగా పోరాడుతూ తన జట్టుని గెలిపించుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. చివర్లో రాహుల్ తెవాతియా ఒక్కసారిగా మలుపు తిప్పినా, అతని ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చివరి ఓవర్‌లో 12 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. ఇషాంత్ శర్మ సూపర్బ్‌గా డిఫెండ్ చేశాడు. ఒక వికెట్ తీసి, కేవలం 6 పరుగులే ఇచ్చాడు. ఫలితంగా.. ఢిల్లీ జట్టు విజయఢంకా మోగించింది.
Mamata Banerjee: ఐక్యంగా ఉంటేనే బీజేపీ ఓడించగలం.. విపక్షాలకు మమత పిలుపు..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అమన్ హకీమ్ ఖాన్ (51) అర్థశతకంతో రాణించడంతో.. అక్షర్ (27), రిపల్ పటేల్ (23) తమవంతు సహకారం అందించడంతో.. ఢిల్లీ అంత మాత్రం స్కోరు చేయగలిగింది. నిజానికి.. మొదట్లో ఢిల్లీ కేవలం 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం చూసి, ఇక ఈ జట్టు 100 పరుగుల మార్క్‌ని అందుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో బరిలోకి దిగి.. అమన్ ఆపద్భాంధవుడిలా తన జట్టుని ఆదుకున్నాడు. అలాగే అక్షర్, రిపల్ సైతం తమ జట్టుకి గౌరవప్రదమైన స్కోరు తెచ్చిపెట్టడంలో కృషి చేశారు. ఇక 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. వాస్తవానికి.. లక్ష్యం చిన్నదే కావడంతో, గుజరాత్ జట్టు సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేధిస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. ఆ జట్టులో ఏడో వికెట్ దాకా మంచి బ్యాటర్లు ఉండటంతో.. గుజరాత్ చాలా ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని భావించారు.
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-10 నగరాలు
కానీ.. ఢిల్లీ బౌలర్లు మాత్రం ఆ అంచనాల్ని తిప్పేశారు. అద్భుతంగా బౌలింగ్ వేసి.. వారిని 125 పరుగులకే కట్టడి చేసి, తమ జట్టుకి మరుపురాని విజయాన్ని అందించారు. అత్యంత కీలకమైన వికెట్లను మొదట్లోనే తీయడంతో, గుజరాత్ జట్టు ఒత్తిడిలో పడింది. ఆ ఒత్తిడిలోనే లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ జట్టు తడబడింది. అయితే.. ఒక దశలో హార్దిక్, మనోహర్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడం చూసి.. గుజరాత్ లక్ష్యాన్ని ఛేధించేస్తుందని భావించారు. వీళ్లిద్దరు కలిసి ఐదో వికెట్‌కి 62 పరుగులు జోడించారు. అలాగే.. చివర్లో 9 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. తెవాతియా హ్యాట్రిక్ సిక్సులు కొట్టి మళ్లీ ఆశలు రేకెత్తించాయి. కానీ.. చివరి ఓవర్‌ని ఇషాంత్ కట్టుదిట్టడం వేయడంతో.. తెవాతియా ఔట్ అవ్వడం, ఆరు పరుగులే రావడం జరిగింది. ఫలితంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఢిల్లీ బౌలర్లలో అహ్మద్, ఇషాంత్ శర్మ తలా రెండు వికెట్లు.. నోర్ట్యే, యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.