జట్టుకు భారంగా మారాడని హార్థిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతను చివరిసారిగా ఎప్పుడు జట్టుకు ఉపయోగపడే ఇన్సింగ్స్ ఆడాడో కనీసం అతనికైనా గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు. రెండు, మూడు మ్యాచ్ లు పక్కన కూర్చోబెడితే కానీ లైన్ లోకి వచ్చేలా కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పంజాబ్‌పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్‌పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది.
పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే పాండ్యా ఆనందం కాసేపైనా లేకుండా పోయింది. నిర్ణీత టైంలో ఇన్సింగ్స్ ను పూర్తి చేయని కెప్టెన్ లకు ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.
ఈ మ్యాచ్ ను మేం ముందే ఫినిష్ చేస్తే బాగుండేది.. కానీ ఆఖరి ఓవర్ వరకు తీసుకొచ్చాం.. నాకు మ్యా్చ్ లు ఇలా చివరి ఓవర్ వరకూ రావడం పెద్దగా నచ్చవు అని హార్థిక్ పాండ్యా చెప్పాడు.
గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆ టీమ్ సారథి హార్థిక్ పాండ్యా మాత్రం తీవ్ర నిరాపరుస్తున్నాడు. గతేడాది అద్భుతంగా రాణించిన హార్థిక్.. ఈ సీజన్ లో మాత్రం బ్యాటింగ్-బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు.