Delhi Capitals Won The Toss And Chose To Bat: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఆల్రెడీ ఈ ఇరుజట్ల మధ్య ఇదివరకే ఒక మ్యాచ్ (ఏప్రిల్ 4న) జరగ్గా.. అందులో గుజరాత్ జట్టు ఘనవిజయం సాధించింది. డీసీ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేధించి గెలుపొందింది. ఇప్పుడు మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఇరు జట్ల మధ్య పోరు జరుగుతుండటంతో.. గుజరాత్ మరోసారి ఢిల్లీపై ఆధిపత్యం చెలాయిస్తుందా? లేకపోతే గుజరాత్‌పై ఢిల్లీ తన ప్రతీకారం తీర్చుకుంటుందా? అనే ఆసక్తి నెలకొంది.
Chikoti Praveen: పోకర్ ఇల్లీగలని తెలీదు.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నా
గుజరాత్ టైటాన్స్‌కి ఏమో గానీ.. ఈ మ్యాచ్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌కి చాలా కీలకమైంది. ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు.. కేవలం రెండంటే రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఢిల్లీ తప్పకుండా ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సి ఉంటుంది. అందుకే, ఢిల్లీకి ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. నిజానికి.. ఢిల్లీలో మంచి బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల ఆటగాళ్లూ ఈ జట్టుకి సొంతం. కానీ.. దురదృష్టవశాత్తు ఈ జట్టు ఆ స్థాయిలో రాణించలేకపోయింది. అందుకే.. మొదట్లో వరుసగా ఐదు పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. అయితే.. గత మ్యాచ్‌లో మాత్రం ఫిల్ సాల్ట్, మిచెల్ మార్ష్ మంచి ఫామ్‌లోకి వచ్చారు. అదే ఫామ్‌ని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే.. ఢిల్లీ పంట పండినట్టే!
TV Actress Shalini: విడాకులు తీసుకుంది.. ఫోటోలు చించి పండగ చేసుకుంది
ఇక గుజరాత్ జట్టు ఎంత పటిష్టమైందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఏడో వికెట్ దాకా పరుగుల వర్షం కురిపించగల బ్యాటర్లు ఈ జట్టులో ఉన్నారు. తక్కువ స్కోరుని డిఫరెంట్ చేసే సత్తా ఉన్న బౌలర్లు ఈ జట్టుకి సొంతం. ఇలాంటి జట్టుతో తలపడి గెలవాలంటే.. ఢిల్లీకి అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. మరి.. ఆ జట్టు రాణించగలదా? ఎవరు ఈ మ్యాచ్‌లో విజయఢంకా మోగిస్తారు? అనేది తెలియాలంటే, ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే!