భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది… మూడో విడతలో 11 నియోజకవర్గాలు, 5 జిల్లాల గుండా ఆయన పర్యటన సాగింది.. ఈ సారి 300.4 కిలోమీటర్లను చేరుకోవడంతో యాత్ర ముగియనుంది.. మొత్తంగా 3 విడతల్లో కలుపుకేంటే 1121 కిలోమీటర్లు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర సాగింది… వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకోవడంతో మూడో విడత పాదయాత్ర ముగినుంది..…
పేదల గుడిసెలు జోలికి వస్తే వరంగల్ ని స్తంభింప చేస్తామని, సీఎంకు చిత్తశుద్ది ఉంటే వరంగల్ లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ నారాయణ మండిపడ్డారు. హన్మకొండలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాలసముద్రం ఏకాశిలా పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నలో గుడిసె వాసులు…
2018లో కేంద్రంలో చక్రం తిప్పుతా అని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించి, హనుమకొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిపాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఎవరు పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద…
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ , వరంగల్ జిల్లాలలో జరుగుతున్న భూ పోరాటాల కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ లను వరంగల్ జిల్లా రాయపర్తిలో పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సీపీఎం(CPM) ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలు ఎర్రటిఎండలో రోడ్డుపై బైఠాయించారు. కాగా…
విశ్వవిఖ్యాత నటుడిగా, పరిపాలకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హనుమకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని, రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇండ్లు ఇచ్చారన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచారని, ఆయన సేవలు…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిషేధిత గుట్కా, జర్దాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కెఆర్ నాగరాజు వివరాలు వెల్లడించారు. కొందరు సమాచారం ఇవ్వడంతో.. టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ల అధ్వర్యంలో లైన్ గల్లీలో దాడులు నిర్వహించామని తెలిపారు. నిర్వాహకులు మహమ్మద్ అబుబకర్, షేక్ నేహల్ ఇద్దరి కిరాణషాప్, గోదాంలలో నిషేధిత గుట్కా జర్దాను సీజ్ చేసినట్లు…
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఉదయం 10 గంటలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శాయంపేట హవేలికి చేరుకుంటారు మంత్రి కేటీఆర్. 10.15 గంటలకు కైటెక్స్ టెక్స్టైల్ పార్కు భూమి పూజ , మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన , యంగ్వన్ ఫొటో డెమో కార్య క్రమం , గణేష్ ఎకోపెట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం , అనంతరం అధికారులు , ప్రజాప్రతినిధులతో సమావేశం…
హన్మకొండ చౌరస్తాలో ఇన్నోవా కారులో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. చాలా రోజులుగా రిపేర్ కోసం పక్కకు పెట్టిన ఇన్నోవాలో వ్యక్తి చనిపోయిన ఘటన పైన పోలీసు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.. సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ స్వీట్ షాపు లో పని చేసేవాడు.. తాగుడుకు బానిసగా…
తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.. కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయన్న ఆయన.. మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేయాలని అనుకోవడం దురాశ…