హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక్క రోజు ప్రచారంలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. పొద్దుగూకితే చాలు గ్రామాల్లో మద్యం ఏరులవుతుంది. ఇదే సమయంలో రాజకీయం రంజుగా సాగుతోంది. రాత్రికి రాత్రి గ్రామ స్థాయి నాయకులను బట్టలో వేసుకుంటున్నారు. విందులు, వినోదాలతో పాటు కరెన్సీ కట్టలతో వారిని కట్టిపడేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ తరహా రాజకీయంలో ఆరితేరాయి. కాస్తా…
అసలే కరోనా సమయం.. బతకడమే కష్టంగా మారింది.. ఎన్నో ఉద్యోగాలు ఊడిపోయాయి.. ఉపాధిపై కరోనా ఘోరంగా దెబ్బకొట్టింది. ఈ సమయంలో.. ఈఎంఐలు కట్టడం కష్టంగా మారిన పరిస్థితి.. కానీ, ఓ ఆటో డ్రైవర్‌కు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయి.. మరోవైపు పోలీసుల వేధింపులు పెరిగాయని.. పెట్రో ధర భారం కూడా పడిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్.. తాను ఫైనాన్స్‌లో తీసుకున్న ఆటోపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.. ఈ ఘటన హన్మకొండలోని కాళోజీ జంక్షన్ లో…
ఆ మధ్య వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల పేర్లను మార్చనున్నట్టు ప్రకటించారు.. దానికి అనుగుణంగా.. ఇవాళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.. వరంగల్ రూరల్ జిల్లాను హనుమకొండ జిల్లాగా.. వరంగల్ అర్బన్ జిల్లాను వరంగల్ జిల్లాగా మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది. హనుమకొండ జిల్లాలోకి వరంగల్ జిల్లాలోని మండలాలు… వరంగల్ జిల్లాలోని మండలాలు హనుమకొండ జిల్లాలలోకి……