CPI Narayana: పేదల గుడిసెలు జోలికి వస్తే వరంగల్ ని స్తంభింప చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదల గుడిసెలు జోలికి వస్తే వరంగల్ ని స్తంభింప చేస్తామని, సీఎంకు చిత్తశుద్ది ఉంటే వరంగల్ లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ నారాయణ మండిపడ్డారు. హన్మకొండలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాలసముద్రం ఏకాశిలా పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.
ఈ ధర్నలో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నలో గుడిసె వాసులు భారీగా తరలి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ.. భూ పోరాటాలు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఏకశిలా పార్కు నుండి కలెక్టరేట్ ముట్టడికి వెల్లుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏకశిలా పార్క్ జంక్షన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో సీపీఐ నేతలు గుడిసె వాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
Also Read
ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కావాలని న్యాయబద్దంగా పోరాడుతున్నం.పేద ప్రజల ఆత్మగౌరవం కోసం సీపీఐ పోరాడుతోంది అన్నారు. ప్రభుత్వంతో చావో,రేవో తేల్చుకుంటాం అని నారాయణ తెలిపారు. ఉంటే గుడిసెలో లేకుంటే జైల్లో ఉంటాను. పోలీసులను అడ్డుపెట్టి పేదలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కారం కాకపోతే, తుపాకులు చేతపడుతామని నారాయణ హెచ్చరించారు.సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల బాగోగులు చూడడం చేతకాక,జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీకి పోతున్నాడని విమర్శించారు.
పేదలకు అండగా ఉండల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుపుతోందని ఆరోపించారు.ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు సహకరిస్తే, మాతో యుద్దానికి సిద్దంగా ఉండాలి హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడడానికి వస్తే మాపై దాడులు చేస్తారా.. వరంగల్ పోరుగడ్డ, భూ పోరాటాలకు ఇక్కడే నాంది పలుకుతాం. జక్కలోద్దిలో పేదల ఇండ్లను కాల్చడం దారుణం అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..!
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!