భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది… మూడో విడతలో 11 నియోజకవర్గాలు, 5 జిల్లాల గుండా ఆయన పర్యటన సాగింది.. ఈ సారి 300.4 కిలోమీటర్లను చేరుకోవడంతో యాత్ర ముగియనుంది.. మొత్తంగా 3 విడతల్లో కలుపుకేంటే 1121 కిలోమీటర్లు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర సాగింది… వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకోవడంతో మూడో విడత పాదయాత్ర ముగినుంది.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి.. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు బండి సంజయ్.. ఇక, అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు ఇద్దరు నేతలు.. ఇప్పటికే బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ వరంగల్ చేరుకోగా.. మధ్యాహ్నానికి జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుని.. ఆ తర్వాత వరంగల్‌కు వెళ్లనున్నారు..
Read Also: What is The BJP Plan: ఎన్టీఆర్‌తో సరే..! నితిన్ ఎందుకు..? బీజేపీ ప్లాన్ అదేనా..?
అయితే, తొలి రెండు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర ఎలాంటి అడ్డకుంటు లేకుండా సాగినా.. మూడో విడతలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు.. బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ఉధ్రిక్తతల మధ్య సాగింది.. అధికార టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు.. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. విడుదల చేసిన ఓ వీడియో సైతం.. సంజయ్ పాదయాత్రపై ప్రభావాన్ని చూపించింది.. ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు వర్దన్నపేట ఏసీపీ.. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని.. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని స్పష్టం చేశారు.. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
కానీ, బీజేపీ నేతలు మాత్రం తగ్గేదేలే అంటూ.. న్యాయపోరాటం చేసి పాదయాత్రకు అనుమతి సంపాదించారు.. మరోవైపు.. రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజాసింగ్, విడుదల.. మళ్లీ అరెస్ట్ చేయడం.. లాంటి ఘటనలు.. పాతబస్తీలో రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఈ నేపథ్యంలో.. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగాల్సిన మూడో విడత ముగింపు బహిరంగ సభకు ఆటంకం ఏర్పడింది. తొలుత అనుమతి ఇచ్చినప్పటికీ.. పాతబస్తీలో టెన్షన్, పాదయాత్ర సమయంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కళాశాల యాజమాన్యం సభకు అనుమతి నిరాకరించింది.. పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి.. సభకు అనుతి ఇవ్వలేమని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.. ఇక, దీనిపై పూడా బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో.. సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది హైకోర్టు.. దీంతో.. ఇవాళ హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ జరగనుంది. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంపై దృష్టిసారించారు ఆ పార్టీ నేతలు.