Revanth Reddy : మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ నగరం నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్.. నేడు వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీయనున్నారు. వరంగల్,…
Telangana : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించి, వర్షపాతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (గురువారం) సిద్దిపేట, హన్మకొండ, ములుగు…
Errabelli Dayakar Rao : హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు. Bollywood…
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు నేడు (మే 14) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సుందరీమణుల రాక సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేసారు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేసారు అధికారులు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో వరంగల్ జిల్లాకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్…
యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన చిడేమ్ సాయి అనే యువకుడు ఈ నెల 15వ తేదీన రాత్రి 7 గంటలకు మిస్సింగ్ అయినట్లు 16న స్టేషన్‌లో కేసు నమోదైంది. అదృశ్యమైన ప్రాంతం హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో సాయి కుటుంబ సభ్యులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సంచలన విషయం వెల్లడైంది. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ వివాహేతర…
హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. బుధవారం రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీ.సీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్‌లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు.
Hanamkonda: హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హిందూ యువకుడిపై దాడికి పాల్పడ్డారు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే.. ముస్లిం అమ్మాయితో మాట్లాడాడు అనే సాకుతో న్యూ శాంపేట్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు కొందరు మైనార్టీ యువకులు
దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పంటలు ఎండిపోతున్నాయని దేవాదుల మోటార్ ను ప్రారంభిస్తున్నాం.. దీంతో 50 - 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.. ప్రాజెక్ట్ ఏజెన్సీని పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6.15కి సుప్రభ హోటల్‌లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ.. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. Also Read: Gold Rate Today: నేడు…
హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.