Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు నేడు (మే 14) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సుందరీమణుల రాక సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేసారు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేసారు అధికారులు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో వరంగల్ జిల్లాకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ చేరుకోనున్నారు. ప్రపంచంలోని 109 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నారు.
Read Also: Supreme Court: నేడు సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం
ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. మరో బృందం రామప్పకు చేరుకోనుంది. ఒక బృందం వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన ఉండనుంది. రెండో టీమ్ రామప్పలో సందడి చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు. 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్‌లో అలేఖ్య శాస్త్రీయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు. రాత్రి 7.20 గంటలకు ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతారు.
Read Also: Security Cabinet Meeting: నేడు మరోసారి సీసీఎస్ కేబినెట్ భేటీ.. భద్రతా వ్యవహారాలపై చర్చ!
ఇక హన్మకొండ కి చేరుకున్న బృందం సుమారు గంటపాటు హరిత హోటల్‌లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు. 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఇక వీరి పర్యటనలో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు కాపలా ఉండనున్నారు. అందాల భామ రాక నేపథ్యంలో మూడంచెల భద్రత కల్పిస్తున్నారు పోలీసు అధికారులు. సీనియర్ అధికారుల పర్యవేక్షణ మధ్య ప్రపంచ సుదరీమణుల పర్యటన కొనసాగనుంది.