గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత తొమ్మిది నెలలుగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
Israel: ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా శనివారం గాజాలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 71 మంది మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Argentina: హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా అర్జెంటీనా తాజాగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసే దిశగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ యోచిస్తున్నారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్ మంగళవారం దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోని పాఠశాలపై దాడి చేసి సుమారు 19 మందిని హతమార్చింది. అదే సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం తొమ్మిది మంది మరణించారు. పాలస్తీనా ఆరోగ్య అధికారులు మంగళవారం తెలియజేశారు. ఒక రోజులోపు నగరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించింది.
Israeli Air Strike: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తాకింది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా హమాస్ నేత హనియే అని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.
Israel Attack : ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం రఫా నగరం ఉత్తర భాగంలో వలస వచ్చిన పాలస్తీనియన్ల కోసం నిర్మించిన శిబిరాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో కనీసం 25 మంది మరణించారు.. మరో 50 మంది వరకు గాయపడ్డారు.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పాలస్తీనాలో అధ్వాన్నమైన పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు.