Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియేకి ఎదురుదెబ్బ.. ఇజ్రాయిల్ దాడిలో 10 మంది కుటుంబీలకు మృతి..
- హమాస్‌కి ఎదురుదెబ్బ..
- ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్..
- పొలిటికల్ చీఫ్ హనియే కుటుంబీకుల మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli Air Strike: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తాకింది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారుల్లో హమాస్ నేత హనియే ఒకరని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ హనియేను మట్టుపెట్టేందుకు టార్గెట్ చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హనియే కుటుంబంలోని 10 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. అయితే, దీనిని ఇజ్రాయిల్ సైన్యం ఇంకా ధృవీకరించలేదు. అనేక మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయని, అయితే, వాటిని వెలికి తీయడానికి అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని గాజాలోని అధికారి మహ్మద్ బసల్ తెలిపారు.
Read Also: Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
హమాస్‌కి పొలిటికల్ బ్యూరో ఛీఫ్‌గా ఉన్న హనియే ఖతార్‌లో ఉంటున్నాడు. అంతకుముందు సెంట్రల్ గాజాలో ఏప్రిల్ నెలలో జరిగిన ఇజ్రాయిల్ దాడిలో ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లను కోల్పోయాడు. కొన్ని నివేదికల ప్రకారం.. అతని కుటుంబంలో దాదాపుగా 60 మంది సభ్యులు మరణించారు. తాజాగా దాడిలో హనియే సోదరి జహర్ హనియే సహా 10 మంది మరణించారని తెలుస్తోంది. మరోవైపు గాజా కాల్పుల విరమణ, బందీల ఒప్పందానికి ఇజ్రాయిల్ కట్టుబడి ఉందని సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. మరోవైపు హమాస్‌ని పూర్తిగా మట్టుపెట్టేవరకు యుద్ధాన్ని ముగించమని పార్లమెంట్‌లో చెప్పారు.
గతేడాది అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు, వందలాది రాకెట్లతో దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ గ్రామాల్లోకి చేరి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 1200 మంది మరణించగా, 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్‌ని పూర్తిగా మట్టుబెట్టే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!