పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. M90 రాకెట్స్‌ను ప్రయోగించింది.
Iran-Israel Tensions: ఇరాన్ లేదా దాని ప్రాక్సీలు రానున్న రోజుల్లో ఇజ్రాయిల్‌పై దాడికి దిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ని ఉటంకిస్తూ వైట్‌హౌజ్ వర్గాలు హెచ్చరించాయి. ‘‘ఈ వారంలోనే దాడి జరిగే అవకాశం ఉంది’’ అని వైట్‌హౌజ్ ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బీ అన్నారు.
Israel–Hamas war: గాజాలో ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై దాడులు జరిపాయి ఇజ్రాయెల్ సేనలు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
Air India: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటంపై ఇరాన్ రగిలిపోతోంది.
ఇదిలా ఉంటే భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి మాట్లాడుతూ, ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపే శక్తి భారత్‌కి ఉందని అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి తాను భారత్ ఒక ముఖ్యమైన దేశమని, బిగ్ పవర్ అని, అంతర్జాతీయ సమాజంలో ప్రభావవంతమైన దేశం అని తాను పదేపదే ప్రస్తావించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
Israel Embassy: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం ఇరాన్ వచ్చిన సమయంలో ఆయనపై దాడి జరిగింది.
Ismail Haniyeh: హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన ఆయనను రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో హత్య చేశారు.
Middle East Tensions: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటం, హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఇజ్రాయిల్ హతమార్చిడం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతల్ని పెంచింది. ఇరాన్ గడ్డపై హనియే హత్యచేయబడటంపై ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది.
Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే హత్యకు గురయ్యాడు. పటిష్టమైన భద్రత కలిగిన ఇరాన్లో ఈ హత్య ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.