Israel-Hamas War: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భారీగా మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. హమాస్ సాయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణి దాడి ప్రారంభించింది.
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్డోల్లాహియాన్ కూడా మరణించారు.
Israel Gaza War : లెబనాన్ సైనిక బృందం హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులో నిరంతరం క్షిపణులు, రాకెట్లను పేల్చుతోంది. కానీ ఇప్పటి వరకు అది చేసిన దాడులు ఏవీ లక్ష్యాన్ని చేధించలేకపోయాయి .
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ మిలిటెంట్లను రాక్షసులతో పోల్చారు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గాజాలోని హమాస్ రాజకీయ విభాగం నాయకుడు, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన యాహ్యా సిన్వార్ రఫాలో లేరని, గాజా దక్షిణాన ఉన్న నగరంలో ఇజ్రాయెల్ తన దాడులతో ముందుకు సాగుతున్నప్పుడు ఇద్దరు అధికారులు చెప్పారు.
ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం.
గాజా నగరంపై దాడుల అనంతరం రఫా హమాస్ ఉగ్రవాదులకు కోటగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నగరంలో ఉన్న టెర్రిస్టులను కనుగొనడానికి ఆ ప్రాంతాన్ని ప్రత్యేక దళాలు స్కాన్ చేస్తున్నాయని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది.
ఇజ్రాయెల్కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని ప్రకటించింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇంకోవైపు గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.