Israel-Hamas: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై తీవ్రమై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిని ఇండియా, యూకే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధినేతలు ఖండించారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250 మందికి పైగా ప్రజలు చనిపోగా.. 1600 మంది వరకు గాయపడినట్లు పాలస్తీనా వైద్య విభాగం వెల్లడించింది.
Hamas Attack On Isreal:: ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పటిష్ట ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నా కూడా ఇజ్రాయిల్ ఈ దాడిని పసిగట్ట లేకపోయింది. హమాస్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ ప్రాంతాల్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఇజ్రాయిలీ పౌరులను బందీలుగా పట్టుకెళ్లారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలో ఇంటర్నెట్ లో వైరలవుతున్నాయి.
Israel: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిగిన దాడికి మరికొన్ని ఇస్లామిక్ మిలిటెంటు గ్రూపులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయిల్ లోని వివాదాస్పద ప్రాంతాలపైకి దాడులు చేసింది. ఇజ్రాయిల్ సరిహద్దు దేశం లెబనాన్ నుంచి ఈ దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఆర్టిలరీ షెల్స్, గైడెడ్ మిస్సైళ్లను పేల్చినట్లు లెబనాల్ లో ఉన్న హమాస్ మద్దతుదారు హిజ్బుల్లా ఆదివారం తెలిపింది.
Israel: ఇజ్రాయిల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. గాజాలోని హమాస్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఇజ్రాయిల్ భూభాగంపైకి గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. గాజా స్ట్రిప్ లోని అనేక భాగాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. హమాస్ శిక్షణా కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. దక్షిణ ఇజ్రాయెల్ పైకి 35 రాకెట్లను గాజా నుంచి ప్రయోగించారు.
Israel blames Hamas for multiple rockets launched from Lebanon: ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులు చేసినట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఇప్పటికే లెబనాన్ చర్యలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. శతృవులు మూల్యం చెల్లించుకోక తప్పదని మెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి పాలస్తీనా గాజా స్ట్రిప్ పై వైమానికి దాడులు నిర్వహించింది.
గత 11 రోజులుగా ఇజ్రాయిల్… గాజాల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గాజాలోని హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య భీకరమైన పోరు జరిగింది. జేరూసలెంపై హమాస్ తీవ్రవాదులు కొన్ని వందల రాకెట్లతో దాడులు చేయగా, ఇటు ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో దాదాపుగా 200 మంది వరకు పాలస్తీనా పౌరులు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు కాగా, లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడులు ఆపాలని, కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి రావడం…
ఇజ్రాయెల్-గాజా మద్య గత 8 రోజులుగా యుద్ద వాతావరణం నెలకొన్నది. గాజాపట్టి నుంచి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులు చేస్తుంటే, ఇజ్రాయెల్ గాజాపట్టిలోని ఉగ్రవాదులను, ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేస్తున్నది. గాజాపట్టిలో హమాస్ ఉగ్రవాదులు 2011 నుంచి దాదాపుగా 1500లకు పైగా సొరంగాలను నిర్మించింది. దీనికోసం సుమారుగా 1.26 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 160 యుద్ద విమానాలు చేసిన దాడుల్లో 150కి పైగా సొరంగాలు ద్వంసం అయ్యాయి.…