అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను హమాస్ ఉగ్రవాదులు లెక్కచేయడం లేదు. ఆయుధాలు విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. కానీ హమాస్ మాత్రం లెక్కచేయడం లేదు. తాజాగా 8 మందిని బహిరంగంగా కాల్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఎట్టకేలకు గాజాలో శాంతి పరిమళాలు వెదజల్లబోతున్నాయి. హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత శాంతి ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది.
Benjamin Netanyahu: హమాస్ ఉగ్రవాదుల దాడిపై ఇజ్రాయిల్ రగిలిపోతోంది. పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొసాద్ వంటి అగ్రశ్రేణి గూఢచార వ్యవస్థ ఉన్నప్పటికీ దాడుల్ని అడ్డుకోలేకపోయాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కేవలం 20 నిమిషాల్లోనే గాజా నుంచి 5 వేల రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ బార్డర్ వద్ద నిఘా వ్యవస్థ కళ్లుగప్పి ఇజ్రాయిల్ పౌరుల్ని హతమార్చారు. ఈ ఊచకోతలో 1200 మంది చనిపోగా.. మరో 240 మందిని హమాస్ బందీలుగా గాజాలోకి…
Kerala Blast: కేరళలోని ఎర్నాకుళంలోని యోహవా క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుస పేలుళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే ఘటనపై దృష్టి సారించింది. NSG, NIA బృందాలను కేరళకు పంపింది.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై భీకరదాడులు చేశారు. అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా దారుణంగా మారణహోమానికి పాల్పడ్డారు. చిన్న పిల్లల్ని కనికరం లేకుండా తలలు నరికి హత్యలకు పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్న స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 3000 మంది…
Israel Hamas War: ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్లు నిర్వహించడానికి సిద్ధమైంది. గాజాను స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ పూర్తి సన్నాహాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాపై దాదాపు 6,000 బాంబులను పడవేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ దేశం హమాస్ స్థానాలపై దాడి చేస్తున్నాడని కూడా చెప్పబడింది.
హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది గాజాపై పూర్తి దిగ్బంధనం విధించబోతున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం తెలిపింది. ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించినట్లు తెలిసింది.
గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా చొరబడిన తరువాత దక్షిణాన ఉన్న భూభాగాలపై తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మేరకు సీఎన్‌ఎన్ సోమవారం నివేదించింది. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు.