Israel Hamas War: గాజా స్వాధీనానికి బయలు దేరిన ఇజ్రాయెల్.. గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్లు నిర్వహించడానికి సిద్ధమైంది. గాజాను స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ పూర్తి సన్నాహాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లక్షలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ట్యాంకులు, డ్రోన్లు, మారణాయుధాలతో సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు హమాస్ రాజకీయ, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తోంది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమికొట్టాలని చూస్తున్నట్లు.. అందుకు తగిన చర్చ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2006 తర్వాత ఇజ్రాయెల్‌లో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అవుతుందని భావిస్తున్నారు.
Read Also:CM YS Jagan: అప్పుడే విశాఖకు.. షిఫ్టింగ్‌పై సీఎం జగన్ క్లారిటీ
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశిస్తే.. నెలల తరబడి ఇక్కడ రక్తపు ఆట కొనసాగుతుంది. ఇజ్రాయెల్ బందీలను హమాస్ చంపుతోందని ఆ దేశం ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ మొదట గాజాలోని పట్టణ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటుందని.. హమాస్‌ను నిర్మూలించనుందని చెబుతున్నారు. అదే సమయంలో హిజ్బుల్లా కూడా హమాస్‌కు మద్దతు ఇస్తుందని.. ఇజ్రాయెల్‌పై పోరాడుతుందని చెప్పారు. హిజ్బుల్లా కూడా ఈ యుద్ధంలో చేరితే యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికే శుక్రవారం గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. భారీ ఆపరేషన్ కోసం సిద్ధమవుతున్నారు. హమాస్ యోధులు కూడా బంకర్‌లు, సొరంగాలలోకి ప్రవేశించడం ద్వారా సన్నాహాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ శనివారం లేదా ఆదివారం పూర్తి శక్తితో గాజాపై దాడి చేయాలని ప్లాన్ చేసింది.
Read Also:Sudan: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. వెలుగులోకి మరో దేశంలోని దిగ్భ్రాంతికర విషయాలు
వాతావరణం అనుకూలించ లేదు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఇజ్రాయెల్ సైన్యానికి వైమానిక మద్దతు లభించలేదు. హెలికాప్టర్లు, జెట్‌లు, డ్రోన్‌ల ఆపరేషన్ కష్టంగా మారింది. భూమిపై నుంచి దాడి జరిగితే ఎయిర్ కవర్ కూడా ఉండాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఇజ్రాయెల్ కూడా గాజాపై గాలి, భూమి, నీరు మూడు వైపుల నుండి దాడి చేయాలనుకుంటోంది. యుద్ధం ఈ స్థాయికి చేరితే చాలా మంది అమాయకులు చనిపోతారని పాలస్తీనియన్లు అంటున్నారు. సాధారణ పౌరులను దీనికి దూరంగా ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణ గాజాను స్వాధీనం చేసుకోవాలా వద్దా అనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ఇప్పటివరకు బందీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!