అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను హమాస్ ఉగ్రవాదులు లెక్కచేయడం లేదు. ఆయుధాలు విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. కానీ హమాస్ మాత్రం లెక్కచేయడం లేదు. తాజాగా 8 మందిని బహిరంగంగా కాల్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు శుభవార్త.. గ్రీన్ క్రాకర్ల వాడకానికి అనుమతి
ఇటీవల గాజా శాంతి ఒప్పందం జరిగింది. దీంతో బందీలను హమాస్ విడుదల చేసింది. ప్రత్యామ్నాయంగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అంతేకాకుండా గాజా నుంచి ఐడీఎఫ్ దళాలు ఉపసంహరణ జరిగింది. ఈ నేపథ్యంలో గాజాపై పట్టు సాధించేందుకు తిరిగి హమాస్ ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే 8 మంది గాజా ప్రజలను బహిరంగంగా కాల్చివేసింది.
ఇది కూడా చదవండి: Maharashtra: సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల.. ఆయుధాలు అందజేత
సోమవారం సాయంత్రం విడుదలైన పుటేజ్‌లో 8 మందికి హమాస్ బహిరంగ శిక్ష విధించింది. వీరంతా ఇజ్రాయెల్ సహకారులు, నేరస్థులు అని ముద్ర వేసింది. హమాస్‌తో సంబంధం ఉన్న ఆకుపచ్చ హెడ్‌బ్యాండ్‌లు ధరించిన ముష్కరులు.. కాల్చి చంపే ముందు తీవ్రంగా కొట్టారు. అనంతరం కళ్లకు గంతలు కట్టి వీధిలో మోకరిల్లింపజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపించింది.
హమాస్ ఆయుధాలు విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. లేదంటే వాళ్లను నిరాయుధులను చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ ఇన్ఫార్మర్ల నెపంతో 8 మంది గాజా ప్రజలను హమాస్ చంపేసింది. దీనిపై ఇజ్రాయెల్, అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Ravi Naik: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత.. మోడీ సంతాపం