Gaza Strip: గాజా దిగ్బంధనం.. నీరు, ఆహారం, ఇంధనం నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza Strip: హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది గాజాపై పూర్తి దిగ్బంధనం విధించబోతున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం తెలిపింది. ఆ ప్రాంతానికి నీరు, ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్, హమాస్ టెర్రరిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. “నేను గాజా స్ట్రిప్‌పై పూర్తి ముట్టడిని ఆదేశించాను. కరెంటు ఉండదు, తిండి ఉండదు, ఇంధనం ఉండదు, అన్నీ మూసేసారు. మేము మానవ జంతువులతో పోరాడుతున్నాము. మేము తదనుగుణంగా వ్యవహరిస్తాము.” అని ఆయన పేర్కొన్నారు.
Also Read: Israel Hamas War: పలు భూభాగాలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. 1,100కు చేరిన మృతుల సంఖ్య
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇజ్రాయెల్ ఆదివారం నాడు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలో 800 కంటే ఎక్కువ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో హనౌన్ నగరం చాలా వరకు ధ్వంసమైంది. చాలా మంది ప్రజలను ఖాళీ చేయించారు.గాజాలో 493 మంది మరణించినట్లు అధికారులు నివేదించారు. హమాస్ కూడా ఇజ్రాయెల్‌పై వేలాది రాకెట్‌లను ప్రయోగించింది.
Also Read: World Cup 2023: ఇండియా మ్యాచ్కు తప్ప.. స్టేడియాలకు వేరే మ్యాచ్లకు ఫ్యాన్స్ రారా..!
సోమవారం ఇజ్రాయెల్ సైన్యం గాజా చుట్టుపక్కల ఉన్న అన్ని కమ్యూనిటీలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన 48 గంటల తర్వాత 700 మందికి పైగా మరణించారని తెలిసింది. “ఇజ్రాయెల్ లోపల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దళాలు, హమాస్ మధ్య ఎటువంటి పోరాటం జరగడం లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న అన్ని కమ్యూనిటీలను తిరిగి స్వాధీనం చేసుకుంది” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియర్ అడ్మ్ డేనియల్ హగారి సోమవారం ఉదయం చెప్పినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది.
ఇంతలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతును ఆదేశించారు. రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక, యుద్ధనౌకల సమూహాన్ని తూర్పు మధ్యధరా ప్రాంతానికి నిర్దేశించారు. వాషింగ్టన్ ఈ ప్రాంతంలో యుద్ధ విమాన స్క్వాడ్రన్‌లను పెంచుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!