Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి 1400 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనియన్లను పంపించేంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో నిలిచేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దీని తర్వాత నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు పలువురు ఉగ్రవాదులతో సహా 9000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయిల్ తో పోరుకు హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు కాలుదువ్వుతున్నారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ పోరాటం తీవ్ర యుద్ధంగా మారుతోంది. ఈ యుద్ధంపై ఇప్పటికే అరబ్, ముస్లిం దేశాలు తమ ఆందోళనను వ్యక్తపరిచాయి. అయితే ఇరాన్‌తో సహా పలు అరబ్ దేశాలు ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. ఓ వైపు గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూనే మరోవైపు లెబనాన్ హిజ్బుల్లా, యెమెన్ హౌతీ రెబల్స్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న మొదలైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపారు, 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే బందీలను సురక్షితంగా విడిపించేందుకు ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్, భూతల దాడులకు సిద్ధమవుతోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు గడిచాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజలను ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. దాదాపుగా 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా తీసుకుని గాజాలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 7000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు…
Israel: ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాద సంస్థను నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో ఉంది. వెతికివెతికి కీలక హమాస్ నాయకులను టార్గెట్ చేస్తూ హతమారుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది మరణించారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ హమాస్‌ని నేలమట్టం చేస్తామని ప్రమాణం చేశారు.
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు క్రూరమైన దాడి జరిపారు. ఈ దాడిలో ఇజ్రాయిల్ లోని 1400 మంది చనిపోయారు. మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా దారుణంగా ఊచకోతకు పాల్పడ్డారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పై జరిగిన దాడుల్లో 1400 మంది చనిపోయారు. పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. 200 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇది ఉంటే ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై భీకరదాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో 3000 మంది మరణించారు.
Israel: గాజాలో అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఏకంగా 500 మంది మరణించడంపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈ దాడి ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కొత్త టర్న్ తీసుకుంది. ఈ దాడికి మీరంటే మీరే కారణమని ఇజ్రాయిల్, హమాస్ ఒకరినొకరిని నిందించుకుంటున్నాయి.